ఫ్లాప్ టాక్ వచ్చినా 9 సెంటర్లలో 100 రోజులు ఆడిన ప్రభాస్ మూవీ ఏదో తెలుసా?

స్టార్ హీరోల సినిమాలలో కొన్ని సినిమాలు అభిమానులకు విపరీతంగా నచ్చేస్తాయి.అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటూ ఉంటాయి.

 Interesting Facts About Prabhas Munna Movie Details, Pan India Star Prabhas, Her-TeluguStop.com

ప్రతి స్టార్ హీరో కెరీర్ లో ఇలాంటి సినిమాలు ఉంటాయి.ప్రభాస్ హీరోగా నటించిన సినిమాలలో మున్నా ఒకటనే సంగతి తెలిసిందే.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

ప్రభాస్ అభిమానులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోలేదు.

ప్రభాస్ కు జోడీగా ఇలియానా ఈ సినిమాలో నటించగా హారిస్ జైరాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.ఈ సినిమాలోని మనసా నువ్వుండే చోటు చెప్పమ్మా పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో కూడా 9 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడటం గమనార్హం.

వరుసగా విజయాలను అందుకుంటున్న దిల్ రాజు సక్సెస్ సెంటిమెంట్ కు మున్నా బ్రేకులు వేసింది.

Telugu Days, Centers, Aadi Purush, Dil Raju, Flop, Prabhas, Maruti, Munna, Prabh

అయితే కమర్షియల్ గా ఈ సినిమా దిల్ రాజుకు పెద్దగా నష్టాలను తెచ్చిపెట్టలేదు.మున్నా స్క్రిప్ట్ విన్న సమయంలోనే దిల్ రాజుకు ఈ సినిమా రిజల్ట్ విషయంలో సందేహాలు కలిగాయి.అయితే వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ విషయంలో వాదించడంతో దిల్ రాజు వెనక్కు తగ్గారని సమాచారం.

Telugu Days, Centers, Aadi Purush, Dil Raju, Flop, Prabhas, Maruti, Munna, Prabh

మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా ప్రభాస్ తో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్న నిర్మాతలలో దిల్ రాజు కూడా ఉన్నారు.ప్రభాస్ దిల్ రాజుకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారో చూడాల్సి ఉంది.ఒకవేళ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమాకు దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది.

ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube