దాసరి మరణానికి అసలు కారణమిదే.. ఆ చిన్న తప్పు చేయడంతో?

నటుడిగా, రచయితగా, దర్శకుడిగా దాసరి నారాయణరావు సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.150కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు 53కు పైగా సినిమాలను నిర్మించాడు.

దాసరి నారాయణరావు ఎంతోమంది కొత్త కళాకారులను సినిమా రంగానికి పరిచయం చేశారు.

తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో సైతం దాసరి నారాయణరావు నటించడం గమనార్హం.సీనియర్ ఎన్టీఆర్ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘనవిజయం సాధించాయి.

దాసరి నారాయణరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.అతి సామాన్య కుటుంబంలో జన్మించిన దాసరి నారాయణరావు స్వయం కృషితో సినిమా రంగంలో ఎదిగారు.

కాంగ్రెస్ తరపున దాసరి నారాయణరావు రాజ్యసభకు ఎంపికయ్యారు.కొన్నేళ్ల పాటు దాసరి నారాయణరావు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.

Advertisement

దర్శకుడు రేలంగి నరసింహారావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాసరి నారాయణరావు సన్నబడటం కోసం బెలూన్ వేయించుకున్నారని ఆ సమయంలో సన్నబడ్డారని పేర్కొన్నారు.ఆరు నెలల తర్వాత ఆ బెలూన్ తీసేయాలని తీసేసిన తర్వాత మళ్లీ బెలూన్ వేయించుకున్నారని రేలంగి నరసింహారావు చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత దాసరి నారాయణరావుకు బెలూన్ ను జూనియర్ డాక్టర్లు వేశారని ఆ బెలూన్ పంక్చర్ కావడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆ ఇన్ఫెక్షన్ వల్ల దాసరి నారాయణరావు చనిపోయారని రేలంగి నరసింహారావు వెల్లడించారు.తాను దాసరి ఆరోగ్యం గురించి విన్నది ఇదేనని రేలంగి నరసింహారావు పేర్కొన్నారు.దాసరి నారాయణరావు బరువు తగ్గడానికి మరో మార్గాన్ని అనుసరించి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదని రేలంగి నరసింహారావు పేర్కొన్నారు.

దాసరి మృతి గురించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి రాగా రేలంగి నరసింహారావు ఆ వార్తలకు చెక్ పెట్టారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు