ప్రకాష్ రాజ్ గురించి కొన్ని అసక్తికరమైన విషయాలు...

తెలుగు లో విలక్షణ నటుడి గా పేరు పొందిన అతి కొద్దీ మంది నటుల్లో ప్రకాష్ రాజ్( Prakash Raj ) ఒకరు.

నాన్న గా, అన్న గా, మామ గా, విలన్ గా, తాత గా నటించి మెప్పించడం లో ఆయన తరవాతే ఎవరైనా.

ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది అంటే చాలు ఆ డైరెక్టర్ గానీ ఆ ప్రొడ్యూసర్ గానీ ముందుగా ఇమాజిన్ చేసుకునేది ప్రకాష్ రాజ్ నే.అందుకే ఆయన అంత స్పెషల్ అని చెప్పాలి.నిజానికి ఒక ఐదు సంవత్సరాల క్రితం వరకు కూడా ఈయన లేని సినిమాలు లేవు అంటే అతిశయోక్తి కాదు ప్రతి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో అయిన నటించి మెప్పించేవాడు.

ఆయన చేసిన చాలా సినిమాలు ఆయనకి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా ఆయనకి అవార్డులను కూడా తీసుకువచ్చాయి ఇక ఆయన నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా రెండు, మూడు సినిమాలు చేసాడు.ఇక రీసెంట్ గా కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగ మార్తాండ సినిమా( Ranga Maarthaanda )లో అయితే తన నటన తో ఆ పాత్రలో జీవించాడు అనే చెప్పాలి.అయితే ఈ సినిమాని మందుగా తనే డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పటికి డైరెక్షన్, యాక్టింగ్ రెండు చేస్తే ఇబ్బంది అని కృష్ణవంశీ( Krishna Vamsi ) కి చెప్పి ఆయన చేత ఈ సినిమాకి డైరెక్షన్ చేసేలా చేశాడు.

ఈ పాత్ర కి కూడా తనకి మంచి పేరు వచ్చింది.

Advertisement

ఆయన నటన కి జాతీయ అవార్డ్ లు( National Awards ) కూడా వచ్చాయి.ప్రస్తుతం ఆయన ఒక లెజెండరీ నటుడు అనే చెప్పాలి.ఆయన లాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీ లో ఉండటం మన అందరి అదృష్టం.

అందుకే ఆయనలాంటి నటులను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తారు.ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు