ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్.. త్వరలో 10 నిమిషాల నిడివితో రీల్స్ చేసుకోవచ్చు..!

ఇన్‌స్టాగ్రామ్ యాప్ రీల్స్‌( Instagram Reels )లో కేవలం కొంత సమయం మాత్రమే కంటెంట్ పోస్ట్ చేయడం కుదురుతుంది.

అయితే ఇప్పుడు 10 నిమిషాల వరకు నిడివి గల కంటెంట్ పోస్ట్ చేయడానికి అనుమతించాలని ఇన్‌స్టాగ్రామ్ యోచిస్తుంది.

ఇందులో భాగంగా 10 మినిట్స్‌కి సపోర్ట్ చేసే రీల్స్ ఫీచర్‌ను టెస్ట్ చేయడం మొదలు పెట్టింది.దీని ద్వారా ఎక్కువ సమయం గల రీల్స్‌ను పోస్ట్ చేసుకోవడం కుదురుతుంది.

ఎడ్యుకేషనల్ వీడియోలు, స్కిట్‌లు, మేకప్ ట్యుటోరియల్‌ల వంటి మరింత కంటెంట్‌ను షేర్ చేయడం సాధ్యమవుతుంది.పేమెంట్ స్పాన్సర్‌షిప్‌ల వంటి ఫీచర్‌ల ద్వారా క్రియేటర్లు తమ కంటెంట్‌ను మానిటైజ్ చేయడాన్ని కూడా ఇది సులభతరం చేస్తుంది.

Instagram Reel Duration Might Be Extended To 10 Minutes,instagram Reels,instagra

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులందరికీ 10 నిమిషాల రీల్స్ ఫీచర్‌( Instagram 10 Minutes Reels Feature )ను ఎప్పుడు విడుదల చేస్తుందో ఇంకా ప్రకటించలేదు.టిక్‌టాక్‌తో పోటీ పడటానికి ప్లాట్‌ఫామ్‌లో ఈ కొత్త ఫీచర్ యాడ్ చేయడం తప్పనిసరి మెటా కంపెనీ భావిస్తోంది.టిక్‌టాక్‌ ఇప్పటికే 10 నిమిషాల వరకు నిడివి గల వీడియోలను పోస్ట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

Advertisement
Instagram Reel Duration Might Be Extended To 10 Minutes,Instagram Reels,Instagra

లాంగ్ రీల్స్‌ను పరీక్షించడంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్‌ల( Instagram Creators ) కోసం ప్లాట్‌ఫామ్‌ను మెరుగుపరచడానికి ఇతర ఫీచర్లపై కూడా పని చేస్తోంది.టిక్‌టాక్‌కి పోటీగా ఇన్‌స్టాగ్రామ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

అయితే, లాంగ్-ఫార్మ్ వీడియో కంటెంట్‌పై కంపెనీ దృష్టి సారించడం బట్టి సవాలును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అర్థమవుతోంది.

Instagram Reel Duration Might Be Extended To 10 Minutes,instagram Reels,instagra

మొత్తంమీద, ఇన్‌స్టాగ్రామ్ 10-నిమిషాల నిడివి గల రీల్స్‌ని పరీక్షించడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.క్రియేటర్స్‌ సక్సెస్ కావడానికి అవసరమైన టూల్స్ అందించడానికి కంపెనీ కట్టుబడి ఉందనడానికి ఈ ఎప్పటికప్పుడే సరికొత్త టూల్స్ పరిచయం చేయడమే నిదర్శనం.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు