ఇళ్ళు లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య.

రాజన్న సిరిసిల్ల జిల్లా :పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ళు లేని నిరుపేదలకు 95.235 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ 3000 కోట్లు నిధులు కేటాయించిందని ఈ మేరకు జీవో నంబరు 6 ను విడుదల చేసిందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య తెలిపారు.ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ లో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా దోమ్మాటీ నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 38,093 ఇండ్లు మంజూరయ్యాయని వీటినీ ఇల్లు లేని నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.అవకతవకలకు పైరవీలకు తావులేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని , ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన కోరారు.

ఇందిరమ్మ ఇండ్లు అందరికీ ఓకేసారి మంజూరు చేయడం సాధ్యం కాదని దశలవారీగా మంజూరు చేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా 100 రోజుల్లో అమలుచేసి తీరుతుంది అన్నారు.ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న అప్లికేషన్ల ఆధారంగానే ఇండ్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుకు రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి మడమ తిప్పే పార్టీ కాదన్నారు.

బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కెటిఆర్ , హారిష్ రావు లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని శాసనసభ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళకు ఇంకా సిగ్గు రాలేదని ఆయన దుయ్యబట్టారు.పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరోసారి బుద్ధి బిఆర్ఎస్ పార్టీ కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ కి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదని వినోద్ రావు ఓటమీ ఖాయమన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి చిన్నారెడ్డి, గిరిధర్ రెడ్డి, గంట బుచ్చాగౌడ్, రొడ్డరాంచంద్రం, బండారి బాల్ రెడ్డి , కిషన్, గణపతి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, నాణ్యమైన విద్యను అందించాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Advertisement

Latest Rajanna Sircilla News