కువైట్ కు షాక్ ఇచ్చిన భారతీయులు..లెక్క పెద్దదే

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వలస వాసులు కువైట్ వంటి దేశాలకు కార్మికులుగా వలసలు వెళ్తూ ఉంటారు.

అక్కడ వివిధ రంగాలలో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ కువైట్ పై ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు లక్షల్లో ఉంటారు.

ఈ క్రమంలో కరోన రావడం ఎంతో మంది వలస వాసులు ఉపాది కరువై వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోతున్నారు అంతేకాక కువైట్ తాజాగా తీసుకువచ్చిన కువైటైజేషన్ కూడా ఎంతో మంది ప్రవాసులు కువైట్ వదిలి వెల్లిపోయేలా చేసింది.దాంతో కువైట్ వదిలిపోతున్న వలస వాసుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువై పోతోంది.

తాజాగా కువైట్ లేబర్ మార్కెట్ ఇచ్చిన నివేదికల ప్రకారం.ప్రతీ ఏటా కువైట్ కు లక్షలాది మంది వలస కార్మికులు వచ్చేవారు.

కానీ కువైట్ లోని కువైటైజేషన్ ప్రస్తుతం ఆ దేశానికి పెద్ద తలనెప్పిగా మారింది.లేబర్ మార్కెట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరిశీలిస్తే ఏడాది కాలంలో సుమారు 2 లక్షల మంది ప్రవాసులు కువైట్ విడిచి వెళ్లిపోయారని తెలుస్తోంది.2020 -21 కాలంలో దాదాపు 15 రంగాలలో పనిచేస్తున్న సుమారు 2 లక్షల మంది కువైట్ విడిచిపెట్టారట.అయితే వలస వాసులు కువైట్ వదిలివేయడంతో ఎన్నో పరిశ్రమలు, పలు రంగాలు కార్మికులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

Advertisement

ముఖ్యంగా కువైట్ లో అత్యధికంగా లాభాలని ఆర్జించే హోటల్, రెస్టారెంట్ రంగాలు నిపుణులైన కార్మికులు వెళ్లిపోవడంతో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితులో ఉన్నాయట, అంతేకాదు వారికి రెట్టింపు జీతాలు ఇస్తామని మళ్ళీ తిరిగి వచ్చేయమని యాజమాన్యాలు ప్రాధేయపడుతున్నారట.ఇదిలాఉంటే కువైట్ విడిచి వెళ్ళే వారిలో అత్యధికులు భారతీయులే కావడం సదరు దేశానికి మరింత షాక్ ఇస్తోంది.

ఈ ఏడాది మొదటి భాగంలోనే దాదాపు 22 వేల మంది భారత్ వెళ్లిపోయారని, భారత్ తరువాత ఈజిప్ట్ దేశ వాసులు ఎక్కువ మంది కువైట్ విడిచి పోయారని తెలుస్తోంది.ఇదిలాఉంటే కువైట్ లోని వలస వాసుల్లో ముఖ్యంగా భారతీయులకే కువైట్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అలాంటిది కువైటైజేషన్ సమస్యను ఎదుర్కోకుండా ముందుగానే భారతీయ కార్మికులు కువైట్ ను విడిచిపెట్టేయడం కువైట్ కు అతిపెద్ద షాక్ అంటున్నారు పరిశీలకులు.

Attachments area .

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు