దోపిడి దొంగల బీభత్సం.. అమెరికాలో భారత సంతతి విద్యార్ధి దారుణహత్య

అమెరికాలో ( America ) దారుణం జరిగింది.దోపిడి దొంగల చేతిలో భారత సంతతి విద్యార్ధి దారుణహత్యకు గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.ఫిలడెల్ఫియాలో( Philadelphia ) ఈ ఘటన జరిగింది.

మృతుడిని జూడ్ చాకోగా( Jude Chacko ) గుర్తించారు.అతను స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.

గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపినట్లు ఖలీజ్ టైమ్స్ నివేదించింది.బాధితుడి తల్లిదండ్రులు కేరళలోని కొల్లాం జిల్లా నుంచి సుమారు 30 ఏళ్ల క్రితం యూఎస్‌కి వలస వచ్చారని మీడియా పేర్కొంది.

Advertisement
Indian-origin Student Shot Dead During Robbery Attempt In US Details, Indian-ori

జూడ్ చాకో చదువుకుంటూనే మరో వైపు పార్ట్‌టైమ్ జాబ్ కూడా చేస్తున్నాడు.దోపిడి సమయంలో ఇద్దరు దుండగులు అతనిపై దాడి చేశారని మీడియా తెలిపింది.

అయితే అమెరికాలో భారత సంతతి విద్యార్ధిని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన.అంతకుముందు ఏప్రిల్ 21, 2023న ఓ ఫ్యూయల్ స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల విద్యార్ధిని కాల్చి చంపినట్లు కొలంబస్ డివిజన్ ఆఫ్ పోలీస్ తెలిపింది.మృతుడిని ఓహియోకు చెందిన సాయిష్ వీరగా గుర్తించారు.

విధుల్లో వుండగానే అతడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారని పోలీసులు తెలిపారు.

Indian-origin Student Shot Dead During Robbery Attempt In Us Details, Indian-ori

ఈ ఏడాది జనవరిలోనూ భారత సంతతి వ్యక్తిని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.నిందితుడిని పాత్రో సిబోరామ్‌గా గుర్తించారు.ఫిలడెల్ఫియాలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇతనిని ముగ్గురు దుండగులు హతమార్చారు.67 ఏళ్ల పాత్రో ఈశాన్య భారతదేశంలోని ఓ చిన్న పట్టణంలో జన్మించి, 1988లో అమెరికాకు వలస వచ్చాడు.పోలీసులు చెబుతున్న దానిని బట్టి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు దోపిడీ సమయంలో పాత్రోను చంపారు.

Indian-origin Student Shot Dead During Robbery Attempt In Us Details, Indian-ori
Advertisement

కాగా.యూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం.దుకాణాలు, పెట్రోల్ బంకులు వంటి వాణిజ్య ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులే అత్యధికంగా చంపబడుతున్నారు.

అర్ధరాత్రి వేళల్లో తెరిచేవుండే పెట్రోల్ బంకుల్లో పెద్ద సంఖ్యలో పనిచేసే భారతీయులు, ఇతర దక్షిణాసియా వాసులు తరచుగా దొంగల చేతిలో బలవుతున్నారు.గతేడాది సెప్టెంబర్‌లో మిస్సిస్సిప్పిలోని టుపెలోలోని పెట్రోల్ బంకులో పరమ వీర్ సింగ్ అనే భారతీయుడు హత్యకు గురయ్యాడు.

ఆ వెంటనే నవంబర్‌లో పాకిస్తాన్ జాతీయుడైన అలీ జుల్ఫికర్ న్యూయార్క్‌లోని ఒక పెట్రోల్ స్టేషన్‌లో హత్యకు గురయ్యాడు.

తాజా వార్తలు