యూకే నుంచి ఆస్కార్ బరిలో ‘సంతోష్ ’.. డైరెక్టర్ భారతీయురాలే!!

ఆస్కార్ 2025కు సంబంధించి అన్ని దేశాలు అధికారికంగా తమ ఎంట్రీలను పంపుతున్నాయి.భారత్ నుంచి లాపతా లేడీస్ చిత్రాన్ని అధికారికంగా అకాడమీకి పంపించారు.

అమీర్ ఖాన్ ( Aamir Khan )నిర్మాతగా ఆయన మాజీ భార్య కిరణ్ రావ్( Kiran Rao ) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇదిలాఉండగా.

లండన్‌లో పుట్టి పెరిగిన , భారత సంతతికి చెందిన సంధ్యా సూరి( Sandhya Suri ) తెరకెక్కించిన ‘సంతోష్’( Santosh ) బుధవారం అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో బ్రిటన్ నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీకి ఎంపికైంది.వితంతువు అయిన ఓ గృహిణి చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం కింద పోలీస్ కానిస్టేబుల్‌గా ఆమెకు ఉద్యోగం లభిస్తుంది.అయితే అనుకోకుండా ఓ యువతి హత్యకు సంబంధించిన దర్యాప్తులో ఇరుక్కుంటుంది.

Advertisement

ఈ కేసు చిక్కుముడిని ఆమె ఎలా విప్పుతుంది, అసలు నేరస్తులు ఎవరనేది ఈ చిత్ర కథ.

ఆస్కార్స్ 2025 కోసం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో సంధ్యా సూరి నిర్మించిన సంతోష్‌ను బ్రిటన్ తరపున అధికారిక ఎంట్రీ కింద ఎంపిక చేసినట్లు బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బీఏఎఫ్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది.వచ్చే నెలలో ప్రారంభం కానున్న బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్( BFI London Film Festival ) (ఎల్ఎఫ్ఎఫ్)లో ఫస్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ సదర్ ల్యాండ్ అవార్డ్ కోసం సంతోష్ పోటీలో నిలిచింది.

స్వయంగా ఈ ప్రాజెక్ట్‌కు రైటర్‌గా వ్యవహరించిన సంధ్య సూరి.ప్రతిభావంతులైన స్థానిక సిబ్బంది సాయంతో 44 రోజుల పాటు లక్నో, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.తాను ఈ కథను యూపీలో షూట్ చేయాలని ముందే అనుకున్నానని సంధ్య చెప్పారు.

తాను అక్కడి నుంచే వచ్చానని.లైవ్ లొకేషన్లలోనే చిత్రీకరణ నిర్వహించామని ఆమె వెల్లడించారు.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈశాన్య ఇంగ్లాండ్‌లోని డార్లింగ్‌టన్‌లో పుట్టి పెరిగిన సూరికి.తన తండ్రి ఎంతో ఇష్టపడే భారతదేశమంటే గౌరవం.

Advertisement

లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఔటింగ్, యూకే థియేటర్లలో రిలీజైన తర్వాత.సంతోష్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సంధ్య సూరి సన్నాహాలు చేస్తున్నారు.

యూకే, ఇండియాలో విజయవంతంగా ప్రదర్శించబడటం నాకు అత్యంత ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు.

తాజా వార్తలు