యూకే : అరెస్ట్ చేసేందుకు వచ్చి బలప్రయోగం.. భారత సంతతి పోలీస్ అధికారి సస్పెన్షన్

నార్త్ లండన్‌లో( North London ) ఓ వ్యక్తిని అరెస్ట్ చేసుందుకు వచ్చి దురుసుగా ప్రవర్తించిన భారత సంతతికి చెందిన మెట్ పోలీస్ అధికారిని అధికారులు విధుల నుంచి తప్పించారు.

సదరు అధికారిని మెట్ నార్త్ వెస్ట్ కమాండ్ యూనిట్‌కు అనుబంధంగా వున్న పోలీస్ కానిస్టేబుల్ మన్‌దీప్ ధర్నిగా( Mandeep Dharni ) గుర్తించారు.

ఈ నెల ప్రారంభంలో బార్నెట్‌లోని కార్ పార్కింగ్ వద్ద ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు అతను బలప్రయోగం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.ఈ దుష్ప్రవర్తనపై సోమవారం ఉన్నతాధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు మన్‌దీప్.

ఒక వ్యక్తిని నిరోధించేటప్పుడు అధికారం, గౌరవం, మర్యాదతో వ్యవహరించడంలో అతను విఫలమయ్యాడని ఆరోపణలు వచ్చాయి.అలాగే క్రిమినల్ డ్యామేజ్ , పబ్లిక్ ఆర్డర్ నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి.

విధుల్లో వున్నప్పుడు ఎలాంటి బలప్రయోగం జరిగినా వారే బాధ్యత వహించాల్సి వుంటుందని తమ అధికారులకు తెలుసునని నార్త్ వెస్ట్ లండన్‌లో పోలీసింగ్ ఇన్‌ఛార్జ్ చీఫ్ సూపరింటెండెంట్ డాన్ నోలెస్( Dan Knowles ) చెప్పారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మన్‌దీప్‌ను విధుల నుంచి తప్పించినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారాన్ని ఇండిపెండెంట్ ఆఫీస్‌కు బదిలీ చేశారు.

Advertisement

అక్కడి నుంచి మెట్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ టీమ్‌‌కు కేసు బదిలీ అయ్యింది.అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత మిస్ కండక్ట్ ప్యానెల్ .మన్‌దీప్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేల్చింది.ఆపై ఎలాంటి నోటీసులివ్వకుండా మన్‌దీప్‌ను విధుల నుంచి తప్పించారు.

కాగా.కొద్దిరోజుల క్రితం నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మహిళ మరణానికి కారణమైనందుకు ఆ అధికారికి యూకే కోర్టు( UK Court ) జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.నిందితుడిని పోలీస్ కానిస్టేబుల్ నదీమ్ పటేల్ (28)గా( Nadeem Patel ) గుర్తించారు.ఇతను 2021 జూన్‌లో తన పెట్రోలింగ్ కారును అత్యంత వేగంగా నడుపుతూ.25 ఏళ్ల శాంటే డేనియల్ ఫోల్క్స్ అనే మహిళను ఢీకొట్టాడు.పటేల్ వాహనం కంటే ముందు పోలీస్ కారును నడుపుతున్న సహచర అధికారి పీసీ గ్యారీ థామ్సన్ (31) నాలుగు రోజుల విచారణ తర్వాత లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

దీంతో పటేల్‌ను జ్యూరీ దోషిగా తేల్చింది.ఈ సందర్భంగా క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) స్పెషల్ క్రైమ్ డివిజన్ హెడ్ రోజ్‌మేరీ ఐన్స్‌లీ మాట్లాడుతూ.నిర్లక్ష్యంగా కారును నడిపి డేనియల్ మరణానికి కారణమైనట్లు పటేల్ అంగీకరించాడని చెప్పారు.

ఈ క్రమంలో కోర్ట్ తీర్పు.బాధితురాలి కుటుంబానికి కొంత ఓదార్పునిస్తుందని రోజ్‌మేరీ ఆకాంక్షించారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు