యూకే: కోవిడ్ రుణం దుర్వినియోగం.. భారత సంతతి కంపెనీ డైరెక్టర్‌పై నిషేధం

ప్రభుత్వం నుంచి కోవిడ్ సపోర్టింగ్ రుణాన్ని తీసుకుని దానిని దుర్వినియోగం చేసిన కేసులో 42 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన కంపెనీ డైరెక్టర్‌పై ఏడేళ్ల నిషేధం విధించింది బ్రిటన్.నిందితురాలిని ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌కు చెందిన రూపిందర్ కౌర్ థాకర్‌గా గుర్తించారు.

ఆమె ఏప్రిల్ 2016లో టీకేఎంఎల్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.అదే సమయంలో కంపెనీని విలీనం కూడా చేశారు.

అయితే కోవిడ్ పరిస్ధితుల కారణంగా ప్రభుత్వం ప్రకటించిన రుణాన్ని పొందేందుకు రూపిందర్ దరఖాస్తు చేశారు.దీనిలో భాగంగా 45,000 బౌన్స్ బ్యాక్ లోన్‌ పొందారు.

అయితే ఆ రుణంతో టీకేఎంఎల్ లిమిటెడ్ ఏం చేసింది, ఆ పరిమాణంలో రుణం పొందేందుకు కంపెనీకి అర్హత వుందా లేదా అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు యూకే ఇన్‌సాల్వెన్సీ సర్వీస్ తెలిపింది.వచ్చే మంగళవారం నుంచి రూపిందర్‌పై విధించిన నిషేధం అమల్లోకి రానుంది.

Advertisement

కోర్టు అనుమతి లేకుండా కంపెనీ ప్రమోషన్, ఏర్పాటు లేదా నిర్వహణలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పాల్గొనకుండా థాకర్ నిషేధానికి గురయ్యారు.పుస్తకాలు, రికార్డుల కోసం పదే పదే అభ్యర్ధించినప్పటికీ రూపిందర్ థాకర్.

కంపెనీ ఆర్ధిక వ్యవహారాల చట్టబద్ధతను వివరించడంలో సహాయపడే ఎలాంటి సాక్ష్యాధారాలను లిక్విడేటర్‌కు అందించలేదని ఇన్‌సాల్వెంట్ ఇన్వెస్టిగేషన్స్ డిప్యూటీ హెడ్ లారెన్స్ జుస్మాన్ తెలిపారు.టీకేఎంఎల్ లిమిటెడ్ 2021లో రుణదాతల స్వచ్ఛంద లిక్విడేషన్‌లోకి ప్రవేశించింది.

కంపెనీ దివాలా తీయడంపై ఇన్‌సాల్వెన్సీ సర్వీస్ విచారణ ప్రారంభించింది.సంస్థ గురించి అడిగినప్పుడు థాకర్ అందజేసిన వివరణలు అసంబద్ధంగా వున్నట్లు తేలింది.

కంపెనీ రిజిస్టర్‌లో టీకేఎంఎల్ లిమిటెడ్‌కి సంబంధించిన ఎంట్రీ టేక్ అవే ఫుడ్ షాపులు, మొబైల్ ఫుడ్ స్టాండ్‌ల వంటి వ్యాపారాలకు ప్రచారకర్తగా రూపిందర్ వృత్తిని పేర్కొంది.కానీ రుణదాతలకు ఇచ్చిన నివేదికలో కంపెనీ .వివాహ వేడుకలకు కేటరింగ్ సేవలు, డెకర్ సామాగ్రిని అందిస్తున్నట్లు వివరించారు.ప్రభుత్వం నుంచి తీసుకున్న కోవిడ్ రుణం 45 వేల పౌండ్లు, కంపెనీ బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపులు జరిగిన 2,50,000 పౌండ్ల మొత్తానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇన్సాల్వేన్సీ సర్వీస్‌కు దొరకలేదు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు