Singapore Book of Records : సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో భారత సంతతి చిన్నారికి చోటు..రీజన్ ఏంటంటే ...!!

సహజంగా మనం చిన్న గుట్ట ఎక్కాలంటేనే ఆపసోపాలు పడతాం.

అలాంటిది ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలంటే, అక్కడి బేస్ క్యాంప్ కు చేరుకోవాలంటే ఒకసారి ఊహించుకుంటేనే ఊపిరి బిగుసుకుపోతుంది కదా.

అలాంటిది మన భారత సంతతికి చెందిన బాలుడు అవలీలగా కొండలు, గుట్టలు ఎక్కి దిగేస్తున్నాడు.తాజాగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లి అతి చిన్న వయసులోనే ఆ అరుదైన ఘనత సాధించిన బాలుడిగా రికార్డ్ సృష్టించాడు.

ఇంతకీ ఎవరీ కుర్రాడు, అతడి వయసు ఎంత , ఎక్కడ ఉంటాడు అనే పూర్తి వివరాలలోకి వెళ్తే.ఆ బుడతడి పేరు మదన్ గార్గ్ తల్లి తండ్రులు మయూర్ గార్గ్, గాయత్రీ లు ఎన్నో ఏళ్ళ క్రితమే సింగపూర్ లో స్థిరపడ్డారు.

సింగపూర్ లో డేటా ఎనలిస్ట్ గా పనిచేస్తున్న మయూర్ గార్గ్ తన కొడుకు సాయాస యాత్రలు చేయడం ఇష్టపడుతున్నాడని గ్రహించాడు.యూట్యూబ్ లో కొందరు సాహస యాత్రలు చేస్తున్న వారి వీడియోలు చూసి వారిలా తాము కూడా తన కొడుకుని ఎవరస్ట్ ఎక్కించాలని భావించాడు.

Advertisement

అనుకున్నదే తడవుగా దాదాపు 6 నెలల పాటు శిక్షణ తీసుకున్నారు.ఆ తరువాత 10 రోజుల పాటు యాత్ర చేయాలని ప్లాన్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే

తాము చేస్తున్న ఈ సాహాయ యాత్రను సీరీస్ రూపంలో ది బ్రేవ్ టూరిస్ట్ యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేశారు.ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తన శరీరాన్ని ఎలా మలుచుకోవాలి, ఎలాంటి అనుభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందో క్షుణ్ణంగా తెలుసుకున్న మదన్ గార్గ్ ఎవరూ ఊహించని విధంగా ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ వరకూ చేరుకున్నాడు.6ఏళ్ళ వయసులోనే సుమారు 5364 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాన్ని 65 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేస్తూ ఎక్కడం అత్యంత సాహసోపేతమైన విషయంగా గుర్తించాడు.దాంతో సింగపూర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆ బుడతడు చేసిన సహాసాన్ని గుర్తించి చోటు కల్పించింది.

అంతేకాదు రెండేళ్ళ వయసు నుంచీ సాయసయాత్రాలు చేయడం మొదలు పెట్టాడని, తన నెక్స్ట్ టార్గెట్ హిమాలయాల్లో ఉన్న అమా డాబ్లామ్ పర్వతమేనని అంటున్నారు.ఏది ఏమైనా అతి చిన్న వయసులో ఇలాంటి సాహస యాత్రలు చేస్తున్న భారత సంతతి బాలుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు