లండన్‌: ఇదేం ఖర్మరా బాబు.. లక్ష అద్దె కట్టినా చిల్లుల కొంపే.. భారతీయుడి ఆవేదన!

పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది లండన్‌కు( London ) బాగా సూట్ అవుతుందని ఇప్పటికే చాలామంది ఎన్నో విమర్శలు చేశారు.

ఈ విషయం తెలియక చాలామంది ఆ నగరానికి తరలిపోతున్నారు.

ఆర్యన్ భట్టాచార్య( Aryan Bhattacharya ) అనే ఇండియన్‌ కూడా లండన్‌లో ఉంటున్నాడు.అయితే, అక్కడ అతను ఉంటున్న ఇంటి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు.

నెలకు అక్షరాలా లక్ష రూపాయలు అద్దె కడుతున్న ఆ ఇల్లు చూడ్డానికి మురికి కొంపలా లేదా పాతబడిపోయిన ఇల్లులా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా పంచుకున్నాడు.

"లక్ష రూపాయలు అద్దె, కానీ ఇక్కడ చూస్తే ముంబై మురికివాడలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది." అంటూ వీడియో మొదలుపెట్టాడు ఆర్యన్.

Advertisement
Indian Man In London Pays 1 Lakh Rent But Feels Like A Chawl Viral Video Details

పైకప్పు నుంచి నీళ్లు కారుతుండటంతో విసుగు చెందాడు.రాత్రిపూట ప్లంబర్‌ను పిలిపించే అవకాశం లేకపోవడంతో గిన్నెలు పెట్టి నీళ్లు పడుతున్న దుస్థితిని చూపించాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Indian Man In London Pays 1 Lakh Rent But Feels Like A Chawl Viral Video Details

దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.కొందరు ఆర్యన్ కష్టాలను అర్థం చేసుకుని మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం లండన్ లాంటి ఖరీదైన నగరంలో జీవించే ముందు తెలుసుకోవాలి కదా అంటూ విమర్శిస్తున్నారు."దేశం గురించి తెలుసుకోకుండా అక్కడికి వెళ్లడం లేదా వెళ్లిన తర్వాత విమర్శించడం సరికాదు.

నీకు నచ్చకపోతే తిరిగి వెళ్లిపో" అంటూ ఒక నెటిజన్ ఘాటుగా స్పందించాడు.

Indian Man In London Pays 1 Lakh Rent But Feels Like A Chawl Viral Video Details
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి27, గురువారం 2025
ఆ మూవీ సెట్స్ లో అందరికీ టార్చర్ చూపించాను.. థమన్ క్రేజీ కామెంట్స్ వైరల్!

మరోవైపు కొందరు ఆర్యన్‌కు మద్దతు తెలుపుతున్నారు."నిజంగా యూకేలో( UK ) అద్దెకు ఉండటం అంటే రాజీ పడటమే" అని ఒకరు కామెంట్ చేయగా, "నీవు వెంటనే లోకల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చెయ్యి.కనీస ప్రమాణాలు లేని ఇంటికి అద్దె వసూలు చేసే హక్కు యజమానికి లేదు" అని ఇంకొకరు సూచించారు.

Advertisement

"నిన్ననే నేను కూడా నా ఇంట్లో( House ) ఇలాంటి పరిస్థితి చూశాను" అంటూ మరొకరు తమ అనుభవాన్ని పంచుకున్నారు.కాగా ఆర్యన్ భట్టాచార్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి 1,600 మంది ఫాలోవర్లు ఉండగా, యూట్యూబ్‌లో దాదాపు 8,000 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.లండన్‌లోని తన జీవితానికి సంబంధించిన వీడియోలను తరచూ షేర్ చేస్తుంటాడు.

ఈ వీడియోతో లండన్ లాంటి ఖరీదైన నగరాల్లో అద్దె ఇళ్ల పరిస్థితులపై చర్చ మొదలైంది.

తాజా వార్తలు