దేశంలోని అత్యంత అవినీతి రాష్ట్రాల లిస్ట్‌ వచ్చేసింది.. తెలంగాణ ఎక్కడ ఉందో చూడండి!

దేశంలోని అవినీతిని పారదోలుతామని పార్టీలు ఎన్ని ఎన్నికల హామీలు ఇచ్చినా.అది మాత్రం సాధ్యం కావడం లేదు.

 Indian Corruptionsurvey-TeluguStop.com

ప్రతి ఏటా అవినీతి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు లంచాలు ఇవ్వాల్సి వస్తూనే ఉంది.

ఇలా గత 12 నెలల కాలంలో దేశంలోని 51 శాతం మంది లంచాలు ఇస్తేగానీ పనులు జరగలేదని తాజా సర్వేలో తేలింది.

ఇండియా కరప్షన్‌ సర్వే 2019లో కొన్ని ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి.

మొత్తం లక్షా 90 వేల మందిని సర్వే చేసి ఈ ఫలితాలను విడుదల చేశారు.ఇదొక స్వతంత్ర సర్వే.

ఆస్తుల రిజిస్ట్రేషన్‌, పోలీస్‌ స్టేషన్లు, మున్సిపాలిటీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం లంచాలు ఇవ్వక తప్పడం లేదని ఈ సర్వేతో మరోసారి స్పష్టమైంది.దేశంలో అవినీతిలో మొదటి 8 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల వివరాలను ఈ సర్వే ప్రజల ముందు ఉంచింది.

Telugu Bihar, Indian, Jharkhand, Karnataka, Punjab, Tamilanadu, Telangana, Uttar

ఇందులో తెలంగాణ ఐదో స్థానంలో ఉండటం విశేషం.ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెంచేశాను.ఇక వాళ్లు లంచాల జోలికే వెళ్లరని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంత ప్రచారం చేసుకున్నా.అదంతా ఉత్తదే అని తేలిపోయింది.లంచం ఇవ్వనిదే పని కావడం లేదని తెలంగాణలోని 67 శాతం మంది చెప్పడం గమనార్హం.ఇందులో చాలాసార్లు లంచం ఇచ్చామని 56 శాతం మంది చెప్పగా.

ఒకటి, రెండుసార్లు ఇచ్చినట్లు 11 శాతం మంది వెల్లడించారు.

అత్యంత అవినీతి రాష్ట్రాల్లో రాజస్థాన్‌ తొలి స్థానంలో ఉంది.

ఇక్కడ 78 శాతం మంది తాము లంచాలు ఇచ్చినట్లు చెప్పారు.ఇక ఆ తర్వాతి స్థానాల్లో బీహార్‌, జార్ఖండ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి.

మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ ఈ టాప్‌ 8 లిస్ట్‌లో మాత్రం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube