ఆరోగ్య విధానంలో అపార అనుభవం: అమెరికా వైద్య రంగంలో భారతీయురాలికి కీలక పదవి

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు ఇస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన జోరును అలాగే కొనసాగిస్తున్నారు.తాజాగా వైద్య రంగంలో అపార అనుభవం వున్న భారతీయ అమెరికన్ నిపుణురాలు డాక్టర్ మీనా శేషమణీకి ఉన్నత పదవిని కట్టబెట్టారు.

43 ఏళ్ల మీనా గతంలో బైడెన్- హారిస్ ట్రాన్సిషన్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (హెచ్‌హెచ్ఎస్) ఏజెన్సీ రివ్యూ టీమ్‌లో పనిచేశారు.ఈ క్రమంలో ఆమెను అమెరికన్ వైద్య రంగంలో కీలకమైన యూఎస్ సెంటర్ ఫర్ మెడికేర్ డైరెక్టర్‌గా నియమించారు.

ఈ సంస్థ 65 ఏళ్లకు పైబడిన వారికి, వికలాంగులకు, మెడికేర్ కవరేజీపై ఆధారపడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న వారికి ఆసరాగా వుంటుంది.యూఎస్ సెంటర్ ఫర్ మెడికేర్‌లో డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌గా, డైరెక్టర్‌గా ఆమె జూలై 6న బాధ్యతలు స్వీకరించారు.

డాక్టర్ మీనా శేషమణి.హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్, ఆరోగ్య ఆర్ధికవేత్త, డాక్టర్, ఆరోగ్య విధాన నిపుణురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రశంసించారు సెంటర్ ఆప్ మెడికర్ అండ్ మెడికేర్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటర్ చిక్విటా బ్రూక్స్ లాసూర్.

Advertisement

మెడికేర్‌పై ఆధారపడే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడంతో పాటు హెల్త్ ఈక్విటినీ అభివృద్ధి చేయడం సీఎంఎస్ బాధ్యత అన్నారు.ప్రస్తుతం డాక్టర్ శేషమణి మెడ్‌స్టార్ హెల్త్‌లో క్లినికల్ కేర్ ట్రాన్స్‌ఫార్మేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.

అక్కడ ఆమె ప్రజల ఆరోగ్యం, వాల్యూ బేస్డ్ కేర్‌ను అమలు చేశారు.సీనియర్ ఎగ్జిక్యూటివ్ నాయకత్వంలో ఆమె 10 ఆసుపత్రులు, దాదాపు 300 మంది ఔట్ పేషెంట్లకు కేర్ సైట్ హెల్త్ కేర్‌ను అందజేశారని మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.

మీనా అమలు చేసిన కమ్యూనిటీ హెల్త్, జెరియాట్రిక్స్, పాలియేటివ్ కేర్ వంటి నమూనాలకు ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ కేర్ ఇంప్రూవ్‌మెంట్ పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది.జార్జ్‌టౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఓటోలారినాలజీ హెడ్‌గా, నెక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మీనా రోగులకు మెరుగైన సేవలను అందించారు.

అంతేకాకుండా ఆరోగ్య విధాన రూపకల్పనలో ఆమెకు దశాబ్ధాల అనుభవం వుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

బీఏ.బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎకనామిక్స్‌లో ఆనర్స్, పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్సిటీ నుంచి ఎండీ, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి హెల్త్ ఎకనామిక్స్‌లో మార్షల్ స్కాలర్‌తో పాటు పీహెచ్‌డీని మీనా పూర్తి చేశారు.జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఓటోలారినాలజీ, తల, మెడ శస్త్రచికిత్సలో రెసిడెన్సీ శిక్షణను పూర్తి చేశారు.

Advertisement

శాన్‌ఫ్రాన్స్‌స్కోలోని కైజర్ పర్మానెంట్ వద్ద హెడ్ అండ్ నెక్ సర్జన్‌గా మీనా శేషమణి ప్రాక్టీస్ చేశారు.

తాజా వార్తలు