ఈ ఇండియన్ స్టార్స్ హాలీవుడ్ కల నెరవేరుతుందా?

మన ఇండియన్ స్టార్స్ఇప్పుడు ప్రాంతీయత ను వదిలి వాటి హద్దులు చెరిపేసి అందరు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించ డానికి ఇష్టపడుతున్నారు.

దీంతో ఇటీవల కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా అందరు కూడా నటన పరంగా స్కోప్ ఉంటే చాలు.

నటించ డానికి ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే మరికొంత మంది నటులు అయితే పాన్ ఇండియా బోర్డర్ ను కూడా దాటి పాన్ వరల్డ్ దిశగా అడుగులు వేస్తున్నారు.

అక్కడ కూడా రాణించాలని కోరుకుంటున్నారు.దీంతో ఆ నటులు హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

మరి మన ఇండియాలో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు ఇప్పుడు హాలీవుడ్ లో అదృష్టం పరీక్షించు కోబోతున్న నటులు ఎవరో చూద్దాం.సౌత్ ఇండియాలోనే అగ్ర కథానాయికలలో ఒకరిగా రాణిస్తున్న సమంత రూత్ ప్రభు ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement
Indian Actors Who Have Worked In Hollywood Projects Aliabhatt Dhanush Samantha D

అందం మాత్రమే కాకుండా అభినయం కూడా ఉన్న సమంత ప్రెసెంట్ పలు క్రేజీ సినిమాల్లో నటిస్తుంది.అలాగే త్వరలోనే ఆరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్ ద్వారా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ధనుష్ ఒకరు.ఈయన ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టు కున్నాడు.2018 లోనే ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్ అనే సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ప్రెసెంట్ ది గ్రే మ్యాన్ అనే మరొక ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు.

Indian Actors Who Have Worked In Hollywood Projects Aliabhatt Dhanush Samantha D

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఇక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.ఇక ఇప్పుడు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.ఈమె హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో భాగం కాబోతున్నట్టు స్వయంగా ప్రకటించింది.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా హాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.ఈయన రెండేళ్ల క్రితమే హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అయినప్పటికీ కరోనా కారణంగా ఈయన ఒప్పుకున్న ప్రాజెక్ట్ వాయిదా పడింది.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

ఇటీవలే మేజర్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న శోభిత దూళిపాళ్ల కూడా హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ లో ఈమె నటించనుంది.బాలీవుడ్ స్టార్ ఆయన ఫర్హాన్ అక్తర్ కూడా మిస్ మర్వెల్ సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఈయన తన విలక్షణ నటనతో ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టు కున్నాడు.ఇక ఇప్పుడు అక్కడ కూడా రాణించాలని తహతహ లాడుతున్నాడు.ఇలా ఈ స్టార్స్ అంతా హాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించు కోవడానికి రెడీ అవుతున్నారు.

తాజా వార్తలు