నేడు భారత్-అఫ్గాన్ మ్యాచ్.. అందరిచూపు వారిద్దరి పైనే..!

భారత్ తన రెండో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది.ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పరుగులు వరదలై పారనున్నాయి.

ఈ పిచ్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది.భారత టాపార్డర్ రాణిస్తే.

ఆఫ్ఘనిస్తాన్( Afghanistan ) చిత్తుగా ఓడిపోవాల్సిందే.వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్లో ఓటమి నుండి తప్పించుకొని విజయం సొంతం చేసుకుంది.

ఇక రెండో మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పసికూన అని తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవలసిందే.భారత బ్యాటర్లు ఆచితూచి ఆడితేనే పసికూన జట్టుపై పైచేయి సాధించడానికి వీలు ఉంటుంది.

Advertisement

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత ఓపెనర్లైన రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తో పాటు శ్రేయస్ అయ్యర్( Shreyas Iyer ) డక్ అవుట్ అయిన సంగతి తెలిసిందే.విరాట్ కోహ్లీ, కేఎల్.రాహుల్ క్రీజులో నిలబడి అధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం వల్లనే భారత్ విజయం సాధించింది.

అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగునున్న సంగతి కూడా తెలిసిందే.ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఫామ్ లోకి రావాలంటే నేడు జరిగే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఇక మంచి అవకాశం.నేడు జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ తో పాటు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్( Ishan Kishan ) ఎక్కువ సేపు క్రీజులో నిలబడితే ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో పాటు పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఫుల్ ఫామ్ కొనసాగించవచ్చు.

ఇక భారత్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ అంటే అందరి దృష్టి విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ పైనే.ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో వీరిద్దరి మధ్య పెద్ద వివాదం జరిగిన సంగతి తెలిసిందే.

అప్పటి నుండి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నవీన్ ఉల్ హక్ ను సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్న సంగతి తెలిసిందే.విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

నవీన్ ఉల్ హక్ బౌలింగ్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు