ఇన్‌క్రెడిబుల్: అర నిమిషంలో 8-అంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకి దిగిన యువకుడు..

ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు.కొందరి టాలెంట్ గురించి తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోక తప్పదు.

తాజాగా అలాంటి ఒక అరుదైన టాలెంట్ ను చూపించే వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఓ వ్యక్తి 30 సెకన్లలోపే భవనంలోని ఎనిమిదో అంతస్తు నుంచి నేలకు దూకాడు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ వీడియోను నవంబర్ 21న Crazyclipsonly అనే యూజర్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్‌లో పోస్ట్ చేసారు.ఇది ఇప్పటివరకు 17 లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది.

అద్భుతమైన శక్తి, చురుకుదనం అవసరమయ్యే అద్భుతమైన స్టంట్‌ను సదరు యువకుడు ప్రదర్శిస్తున్నట్లు వీడియోలో కనిపించింది.అతడు ప్రతి అంతస్తు అంచులను పట్టుకొని కింది ఫ్లోర్ పై దూకుతున్నాడు.తన శరీరాన్ని స్వింగ్ లా ఉపయోగిస్తున్నాడు, నెక్స్ట్ ఫ్లోర్ కు పడిపోయే ముందు అంచుల నుంచి వేలాడుతున్నాడు.

Advertisement

ఎటువంటి భద్రతా పరికరాలు లేదా సహాయం లేకుండా ఓన్లీ శారీరక నైపుణ్యాలు( Physical skills only ), ధైర్యంతో అతడు ఈ స్టంట్ చేశాడు.

ఈ వీడియో చాలా మంది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది, అతని సాహసోపేతమైన, ఆకట్టుకునే ఫీట్‌ను చాలామంది ప్రశంసించారు.మానవ సామర్థ్యాల పరిమితులను అధిగమించి చూపించిన అతడిని కొందరు బాగా మెచ్చుకున్నారు.ఈ వ్యక్తి లాగా చేయడానికి ఇతరులు ఎవరూ ట్రై చేయవద్దని కూడా కోరారు.

పొరపాటున ఫ్లోర్ పైనుంచి కింద పడితే కాళ్లు, చేతులు విరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ స్టంట్ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నా స్ఫూర్తిదాయకంగా మాత్రం అసలు చూడకూడదు.

దీనిని మీరు కూడా ఒకసారి చూసేయండి.

కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?
Advertisement

తాజా వార్తలు