చనిపోయిన వారి ఆస్తులతో బాగా లాభపడుతున్న కింగ్ చార్లెస్ III..?

ఉత్తర-పశ్చిమ ఇంగ్లాండ్‌లో మరణిస్తున్న వ్యక్తుల ఆస్తులతో కింగ్ చార్లెస్ III( King Charles III ) బాగా లాభపడుతున్నారని తాజాగా వార్త సంస్థ గార్డియన్ నివేదించింది, వీలునామా లేదా బంధువులు లేకుండా మరణిస్తున్న వారి డబ్బు, ఆస్తి, షేర్లు వంటివి కింగ్ చార్లెస్‌కు లబ్ధి చేకూరుస్తున్నాయని ఆ రిపోర్టు ఆరోపించింది.ఆ ఆస్తులను బోనా వాకాంటియా అని పిలుస్తారు.

 చనిపోయిన వారి ఆస్తులతో బాగా ల�-TeluguStop.com

ఈ ఆస్తులు చట్టబద్ధంగా రాజు వారసత్వ ఎస్టేట్, డచీ ఆఫ్ లాంకాస్టర్( Duchy of Lancaster ) ఆధీనంలో ఉంటాయి.

బోనా వాకాంటియా( Bona Vacantia ) నుంచి డబ్బును స్వచ్ఛంద సంస్థలకు ఇస్తామని డచీ చెబుతోంది కానీ ది గార్డియన్ వేరే చిత్రాన్ని చూపించే సీక్రెట్ డాక్యుమెంట్స్ పొందింది.

లక్షల పౌండ్ల విలువైన డబ్బును సొంత ఆస్తులను రెనోవేట్, ఇంప్రూవ్ చేయడానికి డచీ ఉపయోగిస్తున్నట్లు డాక్యుమెంట్స్ వెల్లడిస్తున్నాయి.అవి రాజుకు ఆదాయాన్ని ఆర్జించే ప్రాపర్టీస్ అని రిపోర్ట్ పేర్కొంది.

ది గార్డియన్ డచీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న కొంతమంది వ్యక్తుల పేర్లు, కథనాలను కూడా కనుగొంది.వారి నిరాడంబరమైన జీవితాలను డబ్బుతో లబ్ది పొందిన విలాసవంతమైన ఆస్తులతో పోల్చింది.

Telugu Bona Vacantia, Britain, Duchy Lancaster, Heritage Assets, Historical, Cha

రహస్య పత్రాలలో ఒకదానిని “SA9” అని పిలుస్తారు.ఇది “హెరిటేజ్ ఆస్తులు”( Heritage Assets ) అని పిలిచే దాని ఆస్తులను సరిచేయడానికి, సంరక్షించడానికి బోనా వాకాంటియా డబ్బును ఉపయోగించడానికి డచీకి అనుమతి ఇస్తుంది.అయినప్పటికీ, “హెరిటేజ్ ఆస్తులు” అనే పదం చాలా విస్తృతమైనది.ఇది చారిత్రక భవనాలు( Historical Buildings ) మాత్రమే కాకుండా, ఆధునిక ఇళ్ళు, సెలవు అద్దెలు, పొలాలు, యార్క్‌షైర్‌లో పక్షులను వేటాడేందుకు ఉపయోగించే పెట్రోల్ స్టేషన్, బార్న్‌లను కూడా కలిగి ఉంటుంది.

Telugu Bona Vacantia, Britain, Duchy Lancaster, Heritage Assets, Historical, Cha

SA9 పాలసీని ప్రవేశపెట్టినప్పుడు 2020, మేలో డచీ బోనా వాకాంటియా మనీని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారని గార్డియన్ చెప్పింది.ఆస్తులను కాపాడేందుకు ఆ సొమ్మును ‘ప్రజా సంక్షేమం’ కోసం వినియోగిస్తారని పాలసీ చెబుతోందని, అయితే దీనివల్ల రాజు ఆర్థికంగా కూడా లబ్ధి పొందుతున్నారని విమర్శకులు అంటున్నారు.రాజు క్వీన్ ఎలిజబెత్ II( Queen Elizabeth II ) నుండి వారసత్వంగా పొందిన తర్వాత, ఎస్టేట్ యజమానిగా తన మొదటి సంవత్సరంలో డచీ ఆఫ్ లాంకాస్టర్ నుంచి 26 మిలియన్ పౌండ్లను అందుకున్నారు.

గార్డియన్ విచారణ ప్రజలలో ఆగ్రహం, షాక్‌ను కలిగించింది, ప్రత్యేకించి డచీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న వ్యక్తుల స్నేహితులలో ఆగ్రహం మరింత వ్యక్తమయింది.

ఈ పనిని అసహ్యకరమైనది, షాకింగ్ నైతికమైనది కాదని వారు అంటున్నారు.డచీ ఆఫ్ లాంకాస్టర్ నివేదికపై వ్యాఖ్యానించలేదు, బకింగ్‌హామ్ ప్యాలెస్ కూడా ఇంకా రియాక్ట్ అవలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube