టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ఐటీ.. తెర వెనుక ఇంత జరిగిందా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ మారిపోయింది.

దేవర,( Devara ) పుష్ప2,( Pushpa 2 ) సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్నాయి.

ఈ సినిమాలు సాధిస్తున్న కలెక్షన్లు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.పెంచిన టికెట్ రేట్లు కూడా ఈ సినిమాల కలెక్షన్లు పెరగడానికి ఒక విధంగా కారణమని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు.

మొత్తం 55 బృందాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్ల ఆఫీసులపై దాడి చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.విచిత్రం ఏంటంటే పలువురు ఫైనాన్షియర్ల ఆఫీసులపై కూడా దాడులు జరగడం గమనార్హం.

దిల్ రాజుతో( Dil Raju ) పాటు దిల్ రాజు కుటుంబ సభ్యులపై కూడా ఐటీ దాడులు( IT Raids ) జరగడం హాట్ టాపిక్ అవుతోంది.ఫేక్ కలెక్షన్ల పోస్టర్లే ఈ దాడులకు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Income Tax Officers Target Tollywood Industry Details, It Raids, Tollywood Produ
Advertisement
Income Tax Officers Target Tollywood Industry Details, It Raids, Tollywood Produ

ఐటీ సోదాల విషయంలో టాలీవుడ్ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.గత కొన్ని నెలల్లో విడుదలైన సినిమాల నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ అధికారులు ఈ దాడులు చేయడం గమనార్హం.ఐటీ సోదాలు ఇక్కడితో ఆగుతాయో లేదా కొనసాగుతాయో చూడాల్సి ఉంది.

ఇతర రాష్ట్రాల నిర్మాతలను సైతం ఐటీ అధికారులు టార్గెట్ చేస్తారేమో చూడాలి.

Income Tax Officers Target Tollywood Industry Details, It Raids, Tollywood Produ

ఐటీ సోదాలు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇతర నిర్మాతలను సైతం ఒకింత భయపెడుతున్నాయి.రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాల్సి ఉంది.ఐటీ సోదాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక విధంగా షాక్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల వల్ల నిర్మాతలకు ఒకింత టెన్షన్ పెరుగుతోంది.నిర్మాతలు 10 సినిమాలు తీస్తే కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ గా నిలుస్తుండటం గమనార్హం.

కన్నప్ప తరహాలో మరో గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. హీరో ఎవరంటే?
Advertisement

తాజా వార్తలు