సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ వ్యక్తి 8 కేజీల బిర్యానీని( 8Kg Biryani ) ఒక్కసారి తినడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.దీనికి సంబంధించిన వీడియోలో, ఆ వ్యక్తి హైదరాబాదీ బిర్యానీని( Hyderabad Biryani ) ఎంతో ఆస్వాదంగా తింటూ కనిపించాడు.
అయితే, ఈ వీడియో చూశాక చాలా మంది “8 కేజీల బిర్యానీ ఒక వ్యక్తి ఎలా తింటాడు?” అని ఆశ్చర్యపోతున్నారు.వీడియోలో, ఆ వ్యక్తి బిర్యానీని ప్రారంభించినప్పటి నుండి చివరి వరకు పూర్తి ఆనందంతో ఉంటూ తినడం కనిపిస్తుంది.
రెస్టారెంట్ లోని ఒక వ్యక్తి చాలా పెద్ద బిర్యానీ గిన్నెలో 8 కేజీల వండిన బిర్యానీ ఉన్న వేడి వేడి బిర్యానీ పాతరని తీసుక వచ్చి అతడి ముందు గిన్నె మొత్తాన్ని బోర్లిస్తాడు.అలా వేసిన తర్వాత ఆ వ్యక్తి చాలా చక్కగా మటన్ ముక్కలను విడదీసి క్రమంగా తినడం ప్రారంభించాడు.
మధ్యలో పెరుగును కూడా తినడం, ఆఖరులో ఎక్స్‌ట్రా డ్రింక్ తీసుకోవడం ఇక్కడ మరో విశేషం.
సోషల్ మీడియా యూజర్స్ ఈ వీడియోపై విభిన్న రియాక్షన్లు ఇచ్చారు.నువ్వు ఆహారం తీసుకోక ఎన్ని రోజులు అయ్యిందంటూ కామెంట్ చేయగా, మరికొందరేమో అతను మనిషా? లేక కుంభకర్ణుడా! అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరు 8 కేజీల బిర్యానీ తినడం నిజమేనా? అది కేవలం 2 లేదా 3 కేజీలే అయి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోని ఇప్పటి వరకు 3 మిలియన్స్ వ్యూస్ రాగా.లక్షల సంఖ్యలో లైక్ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు, ఒక వ్యక్తి 8 కేజీల బిర్యానీ తినడం సాధ్యం కాదని, అతని శరీరంలో అంత ఆహారం పట్టే స్థలం లేదని భావిస్తున్నారు.ఈ వీడియో చూడడానికి కాస్త ఆశర్యపరిచిన ఈ వీడియో మరింత వివాదాన్ని రేపుతోంది.ఇది కేవలం లికెస్, వ్యూస్ కోసమే ఎడిట్ చేసి పెట్టారని అంటున్నారు.ఏది ఏమైనా ఈ వైరల్ వీడియోను చుసిన మీకు ఏమనిపించిందో ఓ కామెంట్ రూపంలో తెలపండి.