దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన ఐఎంఏ.. ఎప్పుడంటే..

వైద్యసేవలు అందించడంలో జాప్యం కావచ్చు.లేదా బిల్లు చెల్లిస్తేనే ట్రీట్‌మెంట్ చేస్తామని కాలయాపన చేస్తున్న సమయంలో రోగి మరణం సంభవించవచ్చు.

ఇలాంటి సమయాల్లో పేషెంట్ తాలూకు బంధువులు వైద్యుల పై దాడులకు దిగడం అందరికి తెలిసిన విషయమే.

ఒక్కో సందర్భాల్లో అయితే హస్పిటల్స్ కూడా ధ్వంసం కూడా చేస్తారు.అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, తదితర రాష్ట్రాల్లో జరుగుతున్నాయట.ఇలా వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 18 న దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) వెల్లడించింది.

ఈ క్రమంలో నల్లవస్త్రాలు, బ్యాడ్జీలు, మాస్కులు ధరించి నిరసన తెలపాలని రాష్ట్రంలోని ఐఎంఏ కార్యాలయాలకు పిలుపునిచ్చింది.ఇదే సమయంలో విలేకరుల సమావేశాలు నిర్వహించి తమ డిమాండ్లు కూడా తెలియచేస్తుందట.

Advertisement

మరి దాడులు చేస్తే కేసులు అంటున్నారు.అధికఫీజులు వసూలు చేసి రోగి ప్రాణాలు తీస్తే ఏం కేసులు పెట్టమంటారు డాక్టర్లు అని ప్రజలు అడగాలని అనుకుంటున్నారట.

దేవర రికార్డును బ్రేక్ చేసిన పెద్ది.. రామ్ చరణ్ సంచలనాలకు తెర తీశాడుగా!
Advertisement

తాజా వార్తలు