మార్గశిర పున్నమి రోజు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే కష్టాలు మాయం..!

ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి అమావాస్యలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

ఈ క్రమంలోనే అమావాస్య పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తూ ఆ రోజు చేయాల్సిన పూజా కార్యక్రమాలను చేయడం వల్ల ఎన్నో కష్టాలు తొలగి పోతాయని భావిస్తారు.

ఈ క్రమంలోనే మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ పౌర్ణమి వ్యక్తికి మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తారు కనుక మార్గశిర పౌర్ణమిని మోక్ష దాయిని పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

అందుకే ఈ పౌర్ణమి రోజు దానం ధ్యానం చేయటం వల్ల ఎన్నో రెట్ల మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఎంతో పవిత్రమైన మార్గశిర పౌర్ణమి రోజు విష్ణు దేవుడు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మోక్షానికి మార్గం తెరవబడుతుంది అని ప్రతి ఒక్కరు భావిస్తారు.

ఎంతో పవిత్రమైన ఈ మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 18వ తేదీ రానుంది.ఈ రోజు ఉదయమే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఉపవాసంతో అమ్మవారికి పూజ చేయాలి.

Advertisement

అనంతరం అమ్మవారి పీఠం ముందు పద్మం ముగ్గువేసి అమ్మవారి ప్రతిమతో పాటు శ్రీహరి చిత్రపటాన్ని ఉంచి పూజ చేయాలి.

అనంతరం చందనం, పూలు, పండ్లు, ప్రసాదం, అక్షతం, ధూపం, దీపం మొదలైన వాటిని సమర్పించండి.అనంతరం పూజా స్థలంలో ఒక బలిపీఠం నుంచి అగ్ని ఆవాహన చేయాలి.ఓం నమో భగవతే వాసుదేవాయ నమః: స్వాహా ఇదం వాసుదేవ్ ఇదం నమమ’ అని స్మరిస్తూ.108 సార్లు అగ్నిని ఆవాహన చేస్తూ పూజలు ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించాలని భగవంతుని ప్రార్థించాలి.ఇలా అమ్మవారిని పూజించిన తర్వాత మన శక్తిసామర్థ్యాలకు దాన ధర్మాలు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలిగి మనకు ఏ విధమైన ఆర్థిక కష్టాలు లేకుండా కాపాడుతుంది.

Advertisement

తాజా వార్తలు