కొబ్బరి పువ్వులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల.. గురించి తెలిస్తే అస్సలు వదలరు..!

కొబ్బరి పువ్వు ( coconut flower )ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కొబ్బరికాయలో నీళ్లు ఇంకిపోయి కొబ్బరి ముదిరినప్పుడు లోపల తెల్లటి పువ్వు ఏర్పడుతూ ఉంటుంది.

రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.అటువంటి కొబ్బరి పువ్వును ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.

కొబ్బరి బొండం, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్లు కొబ్బరి గురించి దాదాపు చాలామందికి తెలుసు.వాటిలో ఉన్న పోషకాలు ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చాలామందికి తెలుసు.

కానీ కొబ్బరి పువ్వు గురించి మనలో చాలామందికి తెలియదు.వీటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి పువ్వు అనేది పల్లెటూర్లలో ఉండే వారికి బాగా తెలిసి ఉంటుంది.ఎందుకంటే పల్లెటూర్లలో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి.అలాగే దాదాపు ప్రతి ఇంటిలోనూ కొబ్బరి చెట్టు ఉంటుంది.

కొబ్బరికాయ కొట్టినప్పుడు మధ్యలో కొబ్బరి పువ్వు కనిపిస్తూ ఉంటుంది.ఇలా కొబ్బరి పువ్వు కనిపిస్తే మంచి జరుగుతుందని కొంతమంది భావిస్తూ ఉంటారు.

దీన్ని చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు.అయితే కొబ్బరి పువ్వులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) దాగి ఉన్నాయి.

వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

కొబ్బరి కంటే కొబ్బరి పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి.అలసట, నీరసం తగ్గి తక్షణ శక్తిని ఇది అందిస్తుంది.అలాగే డయాబెటిస్ ( Diabetes )ఉన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

Advertisement

అంతేకాకుండా కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.శరీరంలో రోగనిరోదక వ్యవస్థను( Immune system ) బలపరుస్తుంది.

అంతేకాకుండా కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌, కిడ్నీ డ్యామేజ్, కాకుండా కాపాడుతుంది.యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్న కొబ్బరి పువ్వు దొరికినప్పుడు అస్సలు వదలకూడదు.

అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా కూడా ఇది చేస్తుంది.

తాజా వార్తలు