పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తల్లిపై బాలుడి ఫిర్యాదు.. కారణం తెలిస్తే నవ్వాగదు

జనరేషన్‌కు తగ్గట్లు పిల్లల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి.ఇప్పటి పిల్లలు( Children ) చాలా స్పీడ్ గా ఉన్నారు.

 A Boy Complains About His Mother At A Police Station Details, Boy, Police Statio-TeluguStop.com

ఏ విషయాన్ని అయినా వేగంగా తెలుసుకోగలుగుతున్నారు.ఏ పనినైనా వేగంగా చేస్తున్నారు.

కొత్త విషయాలను త్వరగా తెలుసుకుంటున్నారు.ఇక టెక్నాలజీ కూడా పెరుగుతుండటంతో.

దానికి తగ్గట్లు పిల్లలు కూడా అప్డేట్ అవుతున్నారు.సొంత తల్లిదండ్రులపైనే పోలీసులకు కంప్లైంట్( Police Complaint ) చేసేంతవరకు పిల్లలు వస్తున్నారు.

తాజాగా అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకుంది.

Telugu China, Complaint, Latest, Mother, Seperate, Travel-Latest News - Telugu

హోం వర్క్ చేయనందుకు తన కుమారుడిని తల్లి( Mother ) మందలించింది.దీంతో బాలుడు కోపంతో తల్లిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.ఏడ్చుకుంటూ వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

బాలుడి మాటలను విని పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.ఈ షాకింగ్ ఘటన చైనాలో( China ) చోటుచేసుకుంది.

చైనాలోని చాంగ్‌కింగ్ లోని పోలీస్ స్టేషన్‌కు ఒక బాలుడి నేరుగా వెళ్లాడు.అక్కడ పోలీసులను కలిసి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు.

హోం వర్క్( Home Work ) చేయలేదని తనను మందలించిందని, తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదని చెప్పాడు.తనను ఇంటికి పంపవద్దని, అనాథాశ్రమానికి పంపాలని కోరాడు.

Telugu China, Complaint, Latest, Mother, Seperate, Travel-Latest News - Telugu

బాలుడి వయస్సు 10 సంవత్సరాలుగా తెలుస్తోంది.బాలుడి ఫిర్యాదుతో ఏం చేయాలో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు.బాలుడి తల్లిదండ్రుల సమాచారం తీసుకుని వారిని సంప్రదించారు.హోం వర్క్ చేయలేదని తనను ఎప్పుడూ తిడుతూ ఉంటుందని, చదువుకోమని ఒత్తిడి తీసుకొస్తుందంటూ బాలుడు చెప్పాడు.దీనికి తల్లి కూడా ఒప్పుకుంది.చివరకు పోలీసులు బాలుడిని తండ్రికి అప్పగించారు.

దీంతో తండ్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కుమారుడిని తీసుకెళ్లాడు.బాలుడు పోలీస్ స్టేషన్ లో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెట్టింట ఈ వీడియో చక్కర్లు కొడుతుండగా.నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

వీడు మాములోడు కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube