Actress Mrinal Thakur : ఆ పాత్రలలో నటిస్తే ఆఫర్లు తగ్గిపోతాయా... అపోహ అంటూ కొట్టి పారేసిన మృణాల్!

సీతారామం సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ తెలుగులో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా అనంతరం ఈమె పలు భాషా చిత్రాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలలో పిప్పా ఒకటి.యుద్ధ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు కాబోతున్న ఈ సినిమాలో ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో హీరో ఇషాన్ కట్టర్ కు నటి మృణాల్ చెల్లెలి పాత్రలో నటించడం విశేషం.సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు ఒకసారిగా చెల్లెలు భార్యల పాత్రలలో నటిస్తే వారికి తదుపరి సినిమాలలో అవకాశాలు రావని అందుకే చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలలో చేయడానికి ఆసక్తి చూపించరనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

అయితే ఇదే విషయం గురించి నటి మృణాల్ మాట్లాడుతూ.హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు సోదరి లేదా భార్య పాత్రలలో నటిస్తే అవకాశాలు రావు అనడం పూర్తిగా అపోహ అంటూ కొట్టి పారేశారు.

If You Act In Those Roles, Will The Offers Decrease Mrinal, Who Was Dismissed As
Advertisement
If You Act In Those Roles, Will The Offers Decrease Mrinal, Who Was Dismissed As

ఇలాంటి పాత్రలలో నటిస్తూ రూల్స్ బ్రేక్ చేసినప్పుడే మనమేంటో నిరూపించుకోగలమని తెలియజేశారు.ఏ పాత్రలో నటించిన ప్రేక్షకులను మెప్పించడమే నిజమైన ప్రతిభగా భావించాలని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఇలాంటి పాత్రలను మిస్ చేసుకుని జీవితంలో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే అద్భుతమైన పాత్రలను వదులుకున్నాననే భావన మనకు కలగకూడదని తెలియజేశారు.

ఇక పిప్పా సినిమాలో తన పాత్ర తన మనసుని తాకిందని తప్పకుండా ప్రతి ఒక్కరికి తన పాత్ర నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు