అతను పెంచుతున్నది దున్నపోతే, నెలకు రూ.9.60 లక్షలు సంపాదన, ఎలాగంటే?

పెంచుతున్నది దున్నపోతు, నెలకు రూ.9.60 లక్షలు సంపాదనా? మా చెవులలో ఎమన్నా పువ్వులు కనిపిస్తున్నాయా అని అనుకుంటున్నారా? మేము చెప్పేది నిజమేనండి బాబు.

హర్యాణలో( Haryana ) ఉండే దున్నపోతులు చాలా ఫేమస్ మరి.ఈ రాష్ట్రంలో కోట్లల్లో విలువ చేసే దున్నలు దొరుకుతాయి.మరెందుకాలస్యం, విషయంలోకి వెళ్ళిపోదాం పదండి.

పానీపాత్ జిల్లా దిడ్వాడి గ్రామానికి చెందిన నరేంద్ర సింగ్( Narendra Singh ) అనే రైతు ముర్రజాతి దున్నపోతును ఒకదానిని పెంచుకొంటున్నాడు.

దానికి అతగాడు ముద్దుగా షెహ‌న్‌షా ( Shehan Shah )అనే పేరు పెట్టాడు.15 అడుగుల పొడవు, ఆరడగుల ఎత్తుతో బాగా బలిష్టంగా వున్న ఆ దున్న వయస్సు పదేళ్లు.దాని ధర తెలిస్తే మీకు గూండాగిపోతుంది బాబు.ఈ దున్నపోతు ధర అక్షరాల రూ.25 కోట్లు అంటే మీరు నమ్ముతారా? వింటేనే షాకింగ్‌గా ఉంది కదా.దీనికి అంతరేటు ఎందుకో ఈ వివరాలు చూడండి.ఈ జాతి దున్నల వీర్యానికి మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.

ప్రస్తుతం నరేంద్రసింగ్ వద్ద ఉంటున్న షెహన్‌బాషా వీర్యాన్ని నెలలో నాలుగుసార్లు బయటకు తీస్తారు.

Advertisement

ఆ వీర్యంతో దాదాపు 800 డోసులను తయారు చేస్తారట.దీన్ని వేరు చేసే ప్రక్రియలో ప్రతి డోసుకు రూ.300 వరకు ఖర్చవుతుంది.ఆ తర్వాత వీటిని మార్కెట్‌లో విక్రయించి నరేంద్రసింగ్‌ నెలకు రూ.9.60 లక్షలు సంపాదిస్తున్నారు అని తెలుస్తోంది.అందుకే ఈ ముర్రాజాతి దున్నలను హర్యాణాలో నల్ల బంగారం అని కూడా పిలుస్తారు.

కర్నాల్‌ నగరం అంటేనే ఈ దున్నలు ప్రసిద్ధి.నరేంద్రసింగ్‌ ఈ దున్న కోసం ఓ ప్రత్యేక ఈతకొలను కూడా కట్టించడం విశేషం.

వివిధ పోటీల్లో కూడా ఈ దున్న విజేతగా నిలిచిందట.ఓసారి నిర్వహించిన ఛాంపియన్‌షిప్‌ పోటిలో పాల్గొని ఏకంగా రూ.30 లక్షలు గెలుచుకుంది అని ఆ యజమాని ఎంతో గర్వంగా చెబుతున్నాడు.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు