నిజంగా కలియుగ దేవత.. డ్రైవర్ కుప్పకూలితే ఆ యువతి ఏం చేసిందో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

ఢిల్లీకి( Delhi ) చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ హనీ పీపల్( Influencer Honey People ) చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే, హనీ తన ఫ్యామిలీతో కలిసి ఉబర్ క్యాబ్‌లో గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు.

హనీ మేకప్ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.దారి మధ్యలో ఊహించని సంఘటన జరిగింది.

క్యాబ్ డ్రైవర్ ( Cab driver )ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు.బాగా నీరసంగా, అస్వస్థతగా అనిపించింది అతనికి.

దాంతో చాలామంది అయితే కంగారు పడిపోయి ఉబర్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తూ కూర్చుంటారు.కానీ హనీ అలా చేయలేదు.

Advertisement
If The Driver Of The Kaliyuga Goddess Really Collapsed, Do You Know What That Yo

వెంటనే రంగంలోకి దిగింది.

If The Driver Of The Kaliyuga Goddess Really Collapsed, Do You Know What That Yo

డ్రైవర్‌ని వెనక సీట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పి, తనే డ్రైవింగ్ సీట్లో కూర్చుంది.సీటు బెల్ట్ ( Seat belt )పెట్టుకుని చాలా ప్రశాంతంగా స్టీరింగ్ పట్టుకుంది.ఆ వీడియోలో మీరు చూడొచ్చు.

ఎంత ధైర్యంగా కారు నడుపుతుందో, ముందు సీట్లో అమ్మమ్మ, వెనక సీట్లో అమ్మ, చిన్న పాప, పక్కనే అస్వస్థతగా ఉన్న డ్రైవర్ అందరినీ క్షేమంగా గమ్యస్థానానికి చేర్చింది హనీ.ప్రయాణమంతా డ్రైవర్‌ని పలకరిస్తూనే ఉంది.మధ్యలో సరదాగా "నేను డ్రైవింగ్ ఎలా చేస్తున్నాను?" అని అడిగింది.డ్రైవర్ కూడా నీరసంగానే నవ్వుతూ "బదియా (చాలా బాగుంది)" అని రిప్లై ఇచ్చాడు.

అప్పుడు హనీ జోక్ చేస్తూ "చూడు బ్రదర్, నీకు బాలేదు కాబట్టి, నేను డ్రైవ్ చేస్తున్నా.ఫేర్ 50-50 షేర్ చేసుకోవాలి అంతే కదా?" అని నవ్వుతూ అంది.

If The Driver Of The Kaliyuga Goddess Really Collapsed, Do You Know What That Yo
లైవ్‌లో జర్నలిస్ట్ కాలర్ సరిచేసిన పెద్దాయన.. సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా..
వైరల్ వీడియో : ఇంట్లోకి దూరిన పాము.. రెప్పపాటులో కూతుళ్లను కాపాడిన తల్లి.. నెటిజన్లు ఫిదా!

మార్చి 18న తీసిన ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.హనీ సమయస్ఫూర్తికి, ఆమె చూపిన దయకు అందరూ ఫిదా అయిపోతున్నారు."ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఇలాంటి సమయాల్లో అది మన ప్రాణాల్ని కాపాడుతుంది" అంటూ హనీ చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.

Advertisement

హనీ త్వరగా స్పందించడం వల్ల డ్రైవర్‌కి మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.అందుకే ఆమె చాలామంది దృష్టిలో నిజమైన హీరోయిన్‌గా నిలిచింది.

తాజా వార్తలు