ఖాళీ కడుపుతో పింక్ సాల్ట్ ను ఇలా తీసుకుంటే గ్యాస్ అన్న మాటే అనరు!

గ్యాస్ ట్రబుల్.అత్యంత సర్వసాధారణంగా వేధించే జీర్ణ సంబంధిత సమస్యల్లో ఒకటి.

మారిన జీవనశైలి, వేళకు ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, కంటినిండా నిద్ర లేకపోవడం తదితర కారణాల వల్ల కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరుగుతుంది.తద్వారా గ్యాస్ సమస్య ఏర్పడుతుంది.

అయితే ఎప్పుడో ఒకసారి గ్యాస్ సమస్య వచ్చినా పెద్దగా పట్టించుకోరు.కానీ కొందరిని తరచూ ఇది వేధిస్తుంది.

గ్యాస్ చిన్న సమస్యగానే అనిపించిన తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

If Pink Salt Is Taken Like This, Gas Problem Will Not Occur Gas Problem, Pink S
Advertisement
If Pink Salt Is Taken Like This, Gas Problem Will Not Occur! Gas Problem, Pink S

గ్యాస్ వల్ల చేసే పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది.ఈ క్రమంలోనే గ్యాస్ సమస్య నుంచి బయటపడటం కోసం నానా తిప్పలు పడుతుంటారు.అయితే గ్యాస్ సమస్య వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

అందుకు పింక్ సాల్ట్ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.పింక్ సాల్ట్ అనేది స్వచ్ఛమైనది.

ఎలాంటి రసాయన ప్రక్రియ లేకుండా పింక్ సాల్ట్ తయారు అవుతుంది.అందుకే ఆరోగ్యపరంగా పింక్‌ సాల్ట్ అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

If Pink Salt Is Taken Like This, Gas Problem Will Not Occur Gas Problem, Pink S

ముఖ్యంగా పింక్ సాల్ట్ ను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే గ్యాస్ అన్న మాటే అనరు.మరి ఇంకెందుకు ఆలస్యం గ్యాస్ సమస్యకు దూరంగా ఉండాలంటే పింక్ సాల్ట్ ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక గ్లాస్ హాట్‌ వాటర్ ను తీసుకోవాలి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఈ వాటర్ లో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఖాళీ కడుపుతో ఈ వాటర్ ని తాగితే జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

దీంతో గ్యాస్ తో సహా అజీర్తి, మలబద్ధకం తదితర జీర్ణ సంబంధిత సమస్యలన్నీ ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.కాబట్టి తరచూ ఎవరైతే గ్యాస్ సమస్యతో సతమతం అవుతున్నారో తప్పకుండా వారు పైన చెప్పిన విధంగా ఖాళీ కడుపుతో పింక్ సాల్ట్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

తాజా వార్తలు