త‌ల‌స్నానానికి ముందు పురుషులు ఈ చిన్న చిట్కాను పాటిస్తే బ‌ట్ట‌త‌ల రానే రాదు!

పురుషులు అత్యంత స‌ర్వ‌సాధార‌ణంగా ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో బ‌ట్ట‌త‌ల( Baldhead ) ఒక‌టి.

అందులోనూ ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది పురుషులు పాతిక‌, ముప్పై ఏళ్ల‌కే బ‌ట్ట‌త‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

బట్టతల పురుషులను మానసికంగా ఎంతగానో కృంగదీస్తుంది.ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది.

అందుకే బట్టతల అంటేనే పురుషులు భయపడుతుంటారు.అయితే బట్టతల వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం ద్వారా బట్టతలకు దూరంగా ఉండవచ్చు.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ కూడా బట్టతల రిస్క్ ను తగ్గించగలదు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ( Onion ) ని తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే అంగుళం అల్లం తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం ముక్కలు( Ginger ) వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, పావు టేబుల్ స్పూన్ లవంగాల పొడి, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ), వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తెలుగు వ్యక్తి.. దాన్ని కాపాడుకోలేకపోయారు..??
జిమ్, సర్జరీ లేకుండా 21 రోజుల్లో బరువు తగ్గిన మాధవన్.. ఎలా సాధ్యమైందంటే?

ప్రతివారం పురుషులు తల స్నానం( Head bath ) చేయడానికి ముందు ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే బట్టతల రానే రాదు.అల్లం, ఉల్లి, లవంగాలు, కొబ్బరి నూనె, విటమిన్ ఈ ఆయిల్( Vitamin E ), అలోవెరా జెల్ ఇవన్నీ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.కుదుళ్ళను బలోపేతం చేస్తాయి.

Advertisement

జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.బట్టతల రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

కాబట్టి ఒత్తయిన జుట్టును కోరుకునే పురుషులు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అవ్వండి.

తాజా వార్తలు