శనివారం శివునికి నల్ల నువ్వులు, నీళ్లు సమర్పిస్తే..!

సాధారణంగా శనివారం శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు అని చెప్పవచ్చు.కానీ శని ఈశ్వరుని అంశం కనుక శనిని శనీశ్వరుడు అని పిలుస్తారు.

కనక శనివారం శని తో పాటు ఈశ్వరుని కూడా పూజించడంవల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.శనికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు శివుడికి ఈ విధంగా పూజ చేయటం వల్ల సకల పాపాలు తొలగిపోయి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

అయితే శనివారం శివునికి నల్లటి నువ్వులను నీటిని సమర్పించటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

If Black Sesame And Water Are Offered To Shiva On Saturday Black Sesame - Water

శనివారం ఉదయం తలంటు స్నానం చేసి నల్లటి నువ్వులను, నీటిని ఆ పరమశివుడికి సమర్పించి.ఓం నమః శివాయ ఈ విధంగా జపించడం వల్ల శివుడు, శని అనుగ్రహం మనపై కలుగుతుంది.అదేవిధంగా శనివారం శనీశ్వరుని ముందు ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం.

Advertisement
If Black Sesame And Water Are Offered To Shiva On Saturday Black Sesame - Water

అంతేకాకుండా శనివారం నల్లని వస్త్రాలను దానం చేసి నల్లటి శునకానికి ఆహారం అందించడం వల్ల శని బాధలు తొలగిపోతాయి.

If Black Sesame And Water Are Offered To Shiva On Saturday Black Sesame - Water

ప్రతి శనివారం శని శాంతి మంత్ర స్తుతి అయిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే మంత్రాన్ని 11సార్లు పఠిస్తే శనిబాధ నుంచి విముక్తి కలుగుతుంది.అదేవిధంగా బియ్యపు పిండి, అరటిపండు, పాలు, బెల్లంతో తయారుచేసిన ప్రమిదలో ఆవు నూనె వేసి ఏడు వత్తులను వెలిగించడం ద్వారా శని ప్రభావం తొలగిపోతుంది.అలాగే శనివారం వేకువజామున తులసి కోట ముందు ఆవనూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.

అదేవిధంగా శనివారం శనీశ్వరునికి పూజతో పాటు శివుడికి పూజ చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి.ఎల్లప్పుడూ కూడా శనీశ్వరుని శని అని పిలవకూడదనీ ఆధ్యాత్మిక పండితులకు తెలియ జేస్తున్నారు.

చర్మాన్ని కేవలం 20 నిమిషాల్లో డీ-టాన్ చేసే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్!
Advertisement

తాజా వార్తలు