లద్దాఖ్‌లో ప్రధాన ఆకర్షణగా ఐస్ స్థూపాలు.. వాటిని ఎందుకు నిర్మించారంటే

లద్ధాఖ్ ప్రాంతం ( Ladakh region )అంటేనే ప్రకృతి అందాలకు నెలవు.

ఎటు చూసినా మంచు కొండలు, పారే హిమానీ నదాలు( Flowing glacier rivers ) ఇలా చూడచక్కని దృశ్యకావ్యం మన మదిలో మెదులుతుంది.

అయితే 15 ఏళ్ల వరకు ఈ పరిస్థితి ఉండేది.ఎప్పుడూ వరదలు ఎరుగని ఆ ప్రాంత ప్రజలకు తొలిసారి వరదలు అంటే ఏంటో తెలిసింది.

వాతావరణ మార్పులతో అక్కడి ఉష్ణోగ్రతలు ఒక సెంటీ గ్రేడ్ పెరిగాయి.దీంతో మంచు గణనీయంగా కరిగిపోసాగింది.

ముఖ్యంగా వసంత కాలంలో ఆ ప్రాంతంలో చుక్క నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది.భూమి బీటలు వారి కనిపించేది.

Advertisement
Ice Stupas Are The Main Attraction In Ladakh Why Were They Built , Ice Stalls, V

పశువులు నీళ్లు దొరక్క, పచ్చిక బయళ్లు లేక ఇబ్బంది పడేవి.

Ice Stupas Are The Main Attraction In Ladakh Why Were They Built , Ice Stalls, V

ఇలాంటి పరిస్థితుల్లో 2010 ఆగస్టు 5వ తేదీన భారీ వర్షాలు కురిశాయి.దీంతో ఊహించని రీతిలో వరద వచ్చింది.సంవత్సరం పాటు కురవాల్సిన వాన కేవలం 2 గంటల్లోనే ఆ ప్రాంతాన్ని ముంచెత్తింది.

ఫలితంగా వందల మంది ప్రజల ఆచూకీ గల్లంతు అయింది.ఇలాంటి లద్ధాఖ్‌లో ప్రస్తుతం పరిస్థితి మారింది.

అక్కడ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఐస్ స్థూపాలు( Ice pillars ) ప్రధాన ఆకర్షణగా మారాయి.వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
హైదరాబాద్ చేరుకున్న మార్క్ శంకర్.. వీడియో వైరల్

ఎంతో ఆకర్షణీయంగా ఉండే లద్ధాఖ్‌లో 2010 తర్వాత 2012, 2015, 2018 సంవత్సరాల్లో వరదలు ముంచెత్తాయి.అంతకు ముందు శీతాకాలంలో ఏర్పడే మంచు కరిగి తర్వాత కాలంలో అది స్థానిక ప్రజలకు సాగునీరుగా, తాగునీరుగా ఉపయోగపడేది.

Advertisement

ఉష్ణోగ్రతలు పెరగడం, వాతావరణ మార్పులతో అక్కడ చుక్క నీరు దొరకడం గగనమైంది.

అక్కడి ఇంజినీర్ వాంగ్‌చుక్‌కు ఓ ఆలోచన వచ్చింది.పెద్దగా కరగని భారీ మంచుగడ్డను ఏర్పాటు చేయాలని తలంచాడు.దానిని అక్కడి వారు అమల్లోకి తెచ్చారు.

కోన్ ఆకారంలో మంచు స్థూపాలను ఏర్పాటు చేశారు.వాటి మధ్యలో నుంచి నాజిల్‌లాగా పెట్టారు.

రాత్రి వేళల్లో మైనస్ 30 డిగ్రీల వద్ద నాజిల్ లో నుంచి వచ్చిన నీరు ఒక శంఖువులాగా ఉండేది.మంచుగడ్డ కట్టి చిన్న సైజు కొండల్లా అవి ఉండేవి.

ఇలా గ్రామాల చివర్లో పెట్టిన ఈ శంఖువులు కరిగి వాటర్‌గా మారేవి.స్థానికుల నీటి అవసరాలను తీర్చేవి.

ఇవి అక్కడ పర్యాటకులకు ఆకర్షణగా మారాయి.

తాజా వార్తలు