వరుసగా 35సార్లు ఫెయిల్.. చివరకు ఐఏఎస్.. విజయ్ వర్ధన్ సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

మనలో చాలామంది ఒకటి రెండుసార్లు ఫెయిల్ అయితే మళ్లీ సక్సెస్ దక్కుతుందో లేదో అని తెగ టెన్షన్ పడుతుంటారు.

వరుసగా 35 సార్లు ఫెయిల్యూర్ ఎదురైతే ఆ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఇన్నిసార్లు ఓటమి ఎదురైతే సాధారణంగా ఎవరైనా మానసికంగా కృంగిపోతారు.అయితే విజయ్ వర్ధన్( Vijay vardhan ) అనే వ్యక్తి మాత్రం ఓటమి విజయానికి తొలిమెట్టు అని భావించి కష్టపడి కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

Ias Vijay Vardhan Success Story Details Here Goes Viral In Social Media , Sirsa

ఏ పోటీ పరీక్ష రాసినా ఫలితం మాత్రం ఒకే విధంగా ఉండటంతో విజయ్ వర్ధన్ మరింత కష్టపడి అనుకున్నది సాధించారు.ఓటమి ఎదురైన ప్రతి సందర్భంలో తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న విజయ్ వర్ధన్ హరియాణా( Haryana )లోని సిర్సా ప్రాంతం వర్ధన్ స్వగ్రామంలో జీవనం సాగించేవారు.2013లో బీటెక్ పూర్తైన తర్వాత ఐఏఎస్ ను లక్ష్యంగా పెట్టుకున్న వర్ధన్ 2014 సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు పరీక్షలు రాశాడు.

Ias Vijay Vardhan Success Story Details Here Goes Viral In Social Media , Sirsa

2018 ముందు వరకు నాలుగుసార్లు సివిల్స్ రాయగా నాలుగుసార్లు చేదు ఫలితాలు ఎదురు కావడం వర్ధన్ ను బాధ పెట్టింది.ఆ తర్వాత నిమిషం కూడా వృథా కాకుండా చదివిన వర్ధన్ 2018 యూపీఎస్సీ( UPSC ) ఫలితాలలో 104వ ర్యాంక్ ను సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.ఆ సమయంలో ఐపీఎస్ రాగా 2021లో కష్టపడి ఐఏఎస్ సాధించడం గమనార్హం.

Advertisement
Ias Vijay Vardhan Success Story Details Here Goes Viral In Social Media , Sirsa

నన్ను స్నేహితులలో చాలామంది హేళనగా మాట్లాడారని వర్ధన్ చెప్పుకొచ్చారు.హేళనగా మాట్లాడిన వాళ్ల మాటలే నాలో ఆత్మస్థైర్యాన్ని నింపాయని వర్ధన్ కామెంట్లు చేశారు.

ఫెయిల్యూర్స్ ఎదురైన సమయంలో మాత్రమే మనం చేస్తున్న తప్పులు మనకు అర్థం అవుతాయని వర్ధన్ అన్నారు.ఆ తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లానని ఆయన తెలిపారు.

ఓర్పు, సహనంతో సక్సెస్ కోసం ఎదురుచూడగా సక్సెస్ దక్కిందని వర్ధన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

స్కూల్ ప్రిన్సిపాల్‌కు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కిండర్ గార్టెన్ పిల్లలు.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు