ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కు కెరీర్ పరంగా అంతా అనుకూలంగా జరుగుతోంది.అల వైకుంఠపురములో, పుష్ప ది రైజ్ ( Pushpa )సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్న బన్నీ పుష్ప ది రూల్ తో మరోమారు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.
మాస్ రోల్స్ అయినా, క్లాస్ రోల్స్ అయినా తన నటనతో నూటికి నూరు శాతం న్యాయం చేసే బన్నీ మనస్సు మాత్రం చాలా సెన్సిటివ్ అని సమాచారం.

అయితే తన జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్ బన్నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసిందట.ఆ యాక్సిడెంట్ అనంతరం బన్నీ డ్రైవింగ్ చేసే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని సమాచారం.బన్నీ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న ప్రతి సందర్భంలో ఈ సంఘటన గుర్తుకు వస్తుందట.
బన్నీకి 19 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఒక ఫ్రెండ్ తో కలిసి హోటల్ కు వెళ్లగా ఆ సమయంలో ఫ్రెండ్ తో బన్నీకి గొడవ జరిగిందట.
కోపంగా లేచి వెళ్లిపోతున్న ఫ్రెండ్ ను ఆపడానికి బన్నీ కారులో బయలుదేరగా వేగంగా వెళ్లడం వల్ల ముందున్న కారును ఢీ కొట్టాడట.
అయితే ఢీ కొట్టిన కారుకు ఏమీ కాకపోవడంతో బన్నీ వాళ్లకు క్షమాపణలు చెప్పాడు.ఆ సమయంలో వర్షం పడుతుండగా బన్నీ ఢీ కొట్టిన కారు వెనుక సీటులో నిండు గర్భిణి ఉన్నారట.
బన్నీని ఏమీ అనకపోయినా ఆమె సీరియస్ గా చూసిన చూపును మాత్రం బన్నీ ఇప్పటికీ మరిచిపోలేదట.

అప్పటినుంచి బన్నీ డ్రైవింగ్( Bunny driving ) చేసే సమయంలో ఎప్పుడూ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడ్డారట.బన్నీ హోటల్ లో గొడవ పడిన ఫ్రెండ్ లేడీ ఫ్రెండ్ కావడం గమనార్హం.సాధారణంగా సెలబ్రిటీలు తమ తప్పుల గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు.
అయితే బన్నీ మాత్రం ఈ విషయంలో ఇతర సెలబ్రిటీలకు భిన్నం అనే చెప్పాలి.బన్నీ దేశభక్తిని చాటి చెప్పేలా ఒక షార్ట్ ఫిల్మ్ లో సైతం నటించిన సంగతి తెలిసిందే.