Rashmi Sudheer: రష్మీ, సుధీర్ లవ్ ట్రాక్ గురించి ఓపెన్ అయిన హైపర్ ఆది.. దెబ్బకు ఆ బూత్ పదాన్నే వదిలేసారుగా?

టాలీవుడ్ కు చెందిన ఆర్టిస్టులు సుధీర్, రష్మీ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ జంట బుల్లితెరపై చేసే సందడి మాత్రం అంతా ఇంతా కాదు.

తమ రొమాన్స్ తో రచ్చ చేస్తూ అందరి దృష్టిలో పడ్డారు.పైగా వీరి మధ్య రిలేషన్ గురించి బయట కూడా నానారకాలుగా మాట్లాడేసుకున్నారు జనాలు.

ఈ జంట తొలిసారిగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో( Jabardasth ) నుండి పరిచయమయ్యారు.ఇక రష్మీ( Rashmi ) యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సుధీర్( Sudheer ) స్టార్ కమెడియన్ గా నిలిచి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.వీరిద్దరూ జబర్దస్త్ షో లో చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Advertisement

అలా జబర్దస్త్ షో లో ఈ జంట బాగా హైలెట్ గా నిలిచింది.నిజానికి వీళ్ళ మధ్య ఉన్న బంధం చూసినట్లయితే వీళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా అనే అనుమానం రాక తప్పదు.

వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ చాలాసార్లు వినిపించింది.ఈ షో లోనే కాకుండా బుల్లితెరలో ప్రసారమౌతున్న పలు షోలలో కూడా ఈ జంట బాగా రచ్చ చేస్తుంటారు.

ఇక గతంలో బుల్లితెర వేదికగా వీరి పెళ్లి కూడా చేశారు మల్లెమాల ప్రొడక్షన్.( Mallemala Production ) ఎన్నోసార్లు వీరి మధ్య మంచి ప్రపోజల్ సన్నివేశాలు కూడా జరిగాయి.

రొమాంటిక్ డాన్స్ లతో మాత్రం ప్రేక్షకులను తమవైపు లాక్కున్నారు ఈ జంట.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈ జంట మంచి అభిమానంగా మారటంతో.వీరి పేరు పైన సోషల్ మీడియాలో ఎన్నో ఖాతాలు సృష్టించి వాటి వేదికగా తమకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంటారు తమ అభిమానులు.ఈ జంట కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఈటీవీలో ప్రసారమైన లాస్ట్ సీజన్ ఢీ డాన్స్ షో లో( Dhee Show ) కూడా టీం లీడర్ గా చేశారు.

Advertisement

అందులో కూడా వీరి మధ్య రొమాన్స్, డైలాగ్స్ బాగా పేలాయి.

అయితే సుధీర్ బుల్లితెరకు గుడ్ బై చెప్పటంతో వీరి మధ్య గ్యాప్ వచ్చింది.ఇక వీరిద్దరూ దూరంగా ఉండటంతో అభిమానులు అస్సలు తట్టుకోలేకపోయారు.సుధీర్ ను బుల్లితెరపై చూడాలని బాగా ఆశపడ్డారు.

అయితే ఇన్ని రోజులకు ఈ జంట అభిమానుల కోరిక తీరింది.తాజాగా ఈటీవీ 28 ఇయర్స్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈటీవీ బలగం( Balagam Show ) అని ప్రోమో వదిలారు.

ఇందులో సీరియల్ ఆర్టిస్టులు, కమెడియన్స్ పాల్గొని బాగా సందడి చేశారు.

ముఖ్యంగా యాంకర్ గా రష్మీ, సుధీర్ లు కనిపించటంతో వారి అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.మళ్లీ ఇద్దరూ తెరపై కనిపించడంతో అసలు ఆగలేకపోతున్నారు.ఇక ఇద్దరు కలిసి ఒక పాటకు రొమాంటిక్ గా డాన్స్ కూడా చేశారు.

అయితే చివర్లో హైపర్ ఆది.( Hyper Adi ) రష్మీ, సుధీర్ వీరి మధ్య లవ్ ట్రాక్ 9 ఏళ్ల నుంచి ఎలా ఉందంటే అని ఏదో చెప్పబోతుండగా వెంటనే.బ్యాక్ గ్రౌండ్ లో.కుర్చీలు మడతపెట్టి . అనే బూతు పదం వచ్చే డైలాగ్ వదిలారు.దాంతో అక్కడున్న వాళ్లంతా ఆ డైలాగ్ విని గట్టిగా అరిచారు.

ఇక సుధీర్ సిగ్గుపడుతూ కనిపించడంతో రష్మీ షాక్ అయినట్లు కనిపించింది.ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు