వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( CM jagan ) ) ఫోకస్ అంతా ప్రస్తుతం రాబోయే ఎన్నికలపైనే ఉంది.ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని, తిరిగి అధికారం చేపట్టాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.
అంతే కాకుండా ఈసారి 175 నియోజిక వర్గాల్లో క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.ప్రస్తుతం ఇదే ఆయనపై నెగిటివిటీ పెరిగేలా చేస్తోంది.
ఎందుకంటే ఏపీలో ప్రజెంట్ దొంగ ఓట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.ఎన్నికల అధికారులు ఇటీవల ఓటర్ల జాబితాపై చేసిన వెరిఫికేషన్ లో భారీ ఎత్తున దొంగ ఓట్లు బయటపడ్డాయి.
దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.గత ఎన్నికల్లో జగన్ దొంగఓట్ల కారణంగానే గెలిచాడని, లేదంటే ఆ స్థాయి విజయం జగన్ కు కష్టమయ్యేదని ప్రతిపక్ష పార్టీలు ఘాటుగా విమర్శిస్తున్నాయి.గత ఎన్నికల్లో అమలు చేసిన దొంగఓట్ల ప్రణాళికనే ఈసారి ఎన్నికల్లో కూడా జగన్ అమలు చేయాలని చూస్తున్నాడని, అందుకే జగన్ వైనాట్ 175 అంటున్నారని ప్రత్యర్థి పార్టీలు ఘాటు విమర్శలు చేస్తున్నాయి.
దీంతో ఎటొచ్చీ ఈ వ్యవహారం ఇప్పుడు జగన్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.ఇదే అభిప్రాయం ప్రజల్లో కలిగిగే మొదటికే ముప్పు వాటిల్లుతుందని వైఎస్ జగన్ లో ఆందోళన పెరుగుతోందట.
ఒక వైపు దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ( N.Chandrababu Naidu )సిద్దమౌతున్నారు.ఇటు రాష్ట్రంలో పదే పదే దొంగఓట్ల వ్యవహారంలో జగన్ ( CM jagan ) వైపు వేలెత్తి చూపిస్తున్నారు.
దీంతో వ్యవహారం నుంచి ఎలా బయటపడాలనే దానిపై వైసీపీ( YCP party ) నేతలు తలలు పట్టుకుంటున్నారట.ఎలాంటి విమర్శనైనా ధీటుగా ఎదుర్కొనే వైసీపీ నేతలు దొంగఓట్ల వ్యవహారంలో మాత్రం డిఫెన్స్ లో పడిపోయారు.
ఎందుకంటే స్వయంగా ఎన్నికల కమిషనే ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడంతో దీని నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు.ఎన్నికలు దగ్గర పడేకొద్ది ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది.
మరి వైఎస్ జగన్ ఈ దొంగఓట్ల వ్యవహారం నుంచి ఎలా బయటపడటారో చూడాలి.