రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ? నేతల హడావుడి

చాలా రోజులుగా టెన్షన్ పెడుతున్న హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కోసం అన్ని పార్టీల నాయకులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

కొత్త కొత్త పథకాలను, హామీలను ఇస్తూ, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.టిఆర్ఎస్,  బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు తమ అభ్యర్థి ఎవరు అనేది స్పష్టంగా ప్రకటన చేయలేదు.

ఒక పార్టీ ప్రకటన చేసిన తర్వాత మరో పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.ఈ లోపే ప్రజలలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది అనేది ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో, అన్ని పార్టీలు.ఎప్పుడు ప్రకటన వెలువడినా,తాము సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

Advertisement

ఇది ఇలా ఉంటే శుక్ర లేదా శనివారం హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు సంకేతాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది.

అందుకే బయటకి ప్రకటించకపోయినా, అన్ని పార్టీలు హడావుడిగా వ్యవహరిస్తున్నాయి.వాస్తవంగా ఈ నెల 16న కెసిఆర్ హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

కానీ అంతకంటే ముందుగా బుధవారం వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి అక్కడ దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చేపట్టారు.గురువారం చెక్కులు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు.

దీనికి కారణం ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతున్నట్టు సంకేతాలు అందడమే కారణంగా తెలుస్తోంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

అంతేకాదు ఇటీవల కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ని మూడు రోజుల క్రితం గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ చేయడం వంటి వ్యవహారాలు , మంత్రి గంగుల కమలాకర్, కొంతమంది ఎమ్మెల్యేలు హుజూరాబాద్ నియోజకవర్గం లోనే ఉంటూ అక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండడం తదితర కారణాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన పై ఉన్న స్పష్టత కారణంగానే అని తెలుస్తోంది.బిజెపి అభ్యర్థిగా ప్రచారం అవుతున్న ఈటెల రాజేందర్ ఇటీవల పాదయాత్ర చేపడుతూ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.ఆయన కోలుకునేందుకు 15 రోజుల సమయం పడుతుందని ఆయన సన్నిహితులు చెప్పినా, ఆయన గురువారం హడావడిగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయారు.

Advertisement

ఇక రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారంపై పార్టీ కీలక నేతలతో సమావేశం అవ్వడం ఇవన్నీ దీనికి సంకేతంగానే కనిపిస్తోంది.మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడితే తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కి అవకాశం కనిపిస్తోంది.

తాజా వార్తలు