నిజ్జర్ హత్య : కెనడా కోర్టు ఎదుట హాజరైన ముగ్గురు భారతీయులు .. ఖలిస్తాన్ మద్ధతుదారుల నిరసన

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య కేసులో నలుగురు భారతీయ విద్యార్ధులను కెనడా పోలీసులు అదుపులో తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు భారతీయులను తొలిసారి వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరిచారు.

ఈ సందర్భంగా సమాజంలోని మిగిలిన వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని న్యాయమూర్తి వారిని ఆదేశించారు.

కరణ్ బ్రార్, ( Karan Brar ) కమల్‌ప్రీత్ సింగ్,( Kamalpreet Singh ) కరణ్ ప్రీత్ సింగ్‌లను( Karanpreet Singh ) సర్రేలోని బ్రిటీష్ కొలంబియా ప్రొవిన్షియల్ కోర్టుకు తీసుకొచ్చారు.మరో అనుమానితుడు అమన్‌దీప్ సింగ్‌ను( Amandeep Singh ) వీడియో లింక్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు.న్యాయస్థానం లోపలికి ప్రవేశించే సమయంలో వారు ఎరుపు రంగు జైలు స్వెట్ సూట్‌లు ధరించారు.

అయితే అమన్‌దీప్ మాత్రం అంటారియోలోని కస్టడీలో ఉన్నాడు.జూన్ 25న తదుపరి విచారణ జరిగే వరకు .వారిని ‘ నో కాంటాక్ట్ ఆర్డర్ ’లో ఉంచినందున న్యాయమూర్తి మార్క్ జెట్టే ఒక వ్యాఖ్యాత ద్వారా అనుమానితులతో మాట్లాడారు.

Advertisement

వీరు ముగ్గురిని న్యాయస్థానంలోకి తీసుకురావడంతో వందలాది మంది నిజ్జర్ అభిమానులు, ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) పెద్ద ఎత్తున చేరుకుని భారత వ్యతిరేక నినాదాలు చేశారు.విచారణ సందర్భంగా కోర్టు హాలులోని ప్రజల మొబైల్స్‌ను సిబ్బంది సేకరించి బయట ప్లాస్టిక్ డబ్బాలో దాచారు.ఆడియో, వీడియోల రికార్డింగ్, ఫోటోలు తీయడాన్ని న్యాయమూర్తి నిషేధించడంతో అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.

మరోవైపు .నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడాలో జరుగుతున్న పరిణామాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు.ఖలిస్తానీ వేర్పాటువాద అంశాలకు పొలిటికల్ స్పేస్ ఇవ్వడం ద్వారా కెనడా ప్రభుత్వం తమ ఓటు బ్యాంక్.

చట్టబద్ధమైన పాలన కంటే శక్తివంతమైనదనే సందేశాన్ని పంపుతోందన్నారు.జాతీయ వార్తాసంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ.

భారతదేశం వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుంది, ఆచరిస్తుందన్నారు.

త్రిష, నయనతారలను రష్మిక వెనక్కు నెట్టేసిందా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?
Advertisement

తాజా వార్తలు