ఎన్టీఆర్‌పై ఎక్కువ ఫోకస్ అందుకేనట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వారందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో వారి కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఎలా ఉంటుందా అని అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు నందమూరి ఫ్యాన్స్ కూడా ఆతృతగా చూస్తున్నారు.దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

NTR, RRR, Ram Charan, Rajamouli, Bollywood-ఎన్టీఆర్‌పై ఎ

ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇక తారక్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో చరణ్ కంటే కూడా తారక్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వార్త గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.అయితే ఈ వార్తలో వాస్తవం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తారక్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేయాలనే ఆలోచనతో తారక్ కోసం భారీ ప్రమోషన్స్ చేయనున్నారు చిత్ర యూనిట్.చరణ్ ఇప్పటికే బాలీవుడ్ జనాలకు సుపరిచితుడు.

కానీ తారక్ బాలీవుడ్ జనాలకు తెలియదు.దీంతో తారక్ పరిచయం భారీగా ఉండాలని, జక్కన్న అండ్ టీమ్ తారక్ ఫస్ట్ లుక్‌ను చరణ్ కంటే కూడా కాస్త ఎక్కవ క్రేజ్ ఉండేలా చూస్తున్నారు.

మరి ఇంతటి క్రేజ్‌తో రాబోయే తారక్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో, అది ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

రాజమౌళి మహేష్ బాబు సినిమాలో లేడీ విలన్...
Advertisement

తాజా వార్తలు