హైదరాబాద్ మియాపూర్‎లో భారీగా బంగారం సీజ్

హైదరాబాద్ లోని మియాపూర్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడింది.

ఈ క్రమంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారు 27 కేజీల బంగారాన్ని సీజ్ చేశారు.

ఈ మేరకు సరైన పత్రాలు లేని 27 కిలోల బంగారంతో పాటు 15 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ క్రమంలోనే మరో వాహనంలో రూ.14 లక్షల నగదును సీజ్ చేశారు.అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదు తరలింపుపై విచారణ చేస్తున్నారు.

కాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం భారీగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు