తెలుగువారి అభిమానం పొందిన మలయాళ స్టార్.. ఏపీలో దుల్కర్ భారీ కటౌట్!

ఈ ఆగష్టు నెలలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

ఈ నెల మొత్తం కూడా పెద్ద సినిమాల నుండి మీడియం రేంజ్ చిన్న సినిమాలు మొత్తం కూడా వరుసగా రిలీజ్ డేట్స్ ప్రకటించారు.

మరి రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాల్లో హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు.దుల్కర్ సల్మాన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన సినిమా సీతా రామం. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు (ఆగష్టు 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించారు.ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో నిర్మించారు.

Advertisement

ఇది ఇలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేసారు.దీంతో అందరు షాక్ అవుతున్నారు.

మన ఇండియన్ సినిమా దగ్గర ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగాయి.భాషతో సంబంధం లేకుండా అందరి నటీనటులు ఇండియన్ వైడ్ గా సినిమాలు చేస్తున్నారు.

సౌత్ ను చిన్న చూపు చూసే బాలీవుడ్ సైతం మన సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతున్నారు.ఈ క్రమంలోనే మలయాళ స్టార్ అయినా దుల్కర్ సల్మాన్ నటించిన సీతా రామం సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర లోని భీమవరంలో ఈయన భారీ 35 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసారు.ఈ భారీ కటౌట్ తో ఈ నటుడిపై మన తెలుగు ప్రేక్షకులకు ఎంత అభిమానమో చెప్పకనే చెప్పారు.

ఈ విషయం తెలిసిన మాలీవుడ్ లో దుల్కర్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్య పోతున్నారు.ఎంతైనా మన తెలుగు వారి అభిమానం ముందు ఎవ్వరు సరిపోరు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు