జుట్టు రాల‌డాన్ని అరిక‌ట్టే ముల్లంగి.. ఇంత‌కీ ఎలా వాడాలంటే?

ముల్లంగి.( Radish ) దుంపకూరల్లో ఇదీ ఒకటి.చలికాలంలో మనకు ముల్లంగి విరి విరిగా దొరుకుతుంటుంది.

ముల్లంగిని చాలా మంది సాంబార్ లో వాడుతుంటారు.అలాగే సలాడ్స్ ( Salads ) ద్వారా తీసుకుంటూ ఉంటారు.

ఆరోగ్యపరంగా ముల్లంగి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.అయితే ఎక్కువ శాతం మందికి తెలియని విషయం ఏమిటంటే జుట్టు సంరక్షణకు( Hair Care ) కూడా ముల్లంగి ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డుకట్ట వేసే సామర్థ్యం ముల్లంగికి ఉంది.ముల్లంగిని ఇప్పుడు చెప్పబోయే విధంగా వాడితే హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్యను సుల‌భంగా నివారించుకోవ‌చ్చు.

Advertisement

అదే స‌మ‌యంలో మరెన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.అందుకోసం ముందుగా ఒక ముల్లంగిని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రైన‌ర్ స‌హాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో ఒక ఎగ్ వైట్,( Egg White ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut Oil ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చాలు ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ముల్లంగి లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, కాపర్ వంటి పోషకాలు మరియు గుడ్డులో ఉంటే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యానికి తోడ్పడతాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ను( Hair Growth ) ఇంప్రూవ్ చేస్తాయి.

Advertisement

దాంతో జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా, పొడుగ్గా పెర‌గ‌డం ప్రారంభ‌మవుతుంది.అంతేకాదు ఈ ముల్లంగి హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది.

హైడ్రేటెడ్ గా, హెల్తీగా తయారవుతుంది.

తాజా వార్తలు