వెన్న‌లో ఇవి క‌లిపి రాస్తే..చ‌ర్మం య‌వ్వ‌నంగా మెర‌వ‌డం ఖాయం!

వెన్న‌ అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

పెరుగుతున్న పిల్ల‌ల‌కు, యువ‌త‌కు, వృద్ధుల‌కు కూడా వెన్న ఓ ఔష‌ధం అనడంలో సందేహ‌మే లేదు.

ఎందుకంటే, ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నివారించే పోష‌కాలు వెన్న‌లో నిండి ఉంటాయి.అందు వ‌ల్ల‌నే వెన్న తీసుకుంటే హెల్త్‌కు మంచిద‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే ఆరోగ్యానికే కాదు.చ‌ర్మానికి కూడా వెన్న ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా మ‌చ్చ‌లు తొలిగించి చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మ‌రియు కాంతివంతంగా మెరిపించ‌డంతో వెన్న ఎఫెక్టివ్ ప‌ని చేస్తుంది.మ‌రి వెన్న‌ను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందు ఒక బౌల్ తీసుకునిఅందులో కొద్దిగా వెన్న మ‌రియు ఓట్స్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖాన్ని అప్లై చేస పావు గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఫేస్ వాష్ యూజ్ చేస ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్త న‌ల్ల మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా మెరుస్తుంది.

అలాగే ఒక బౌల్ లో ఒక స్పూన్ వెన్న తీసుకుని అందులో చిటికెడు ప‌సుపు మ‌రియు ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి రెండు, మూడు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.కాసేప‌టి త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.ఇక గిన్నెలో ఒక స్పూన్ వెన్న మ‌రియు ఒక స్పూన్ తేనె తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూసి అర గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల య‌వ్వ‌నంగా మార‌డంతో పాటు చ‌ర్మ ఛాయ కూడా పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు