హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేసే కొత్తిమీర.. ఇలా వాడారంటే మరిన్ని బెనిఫిట్స్!

స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యల్లో హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది ముందు వరుసలో ఉంటుంది.

నిద్రను నిర్లక్ష్యం చేయడం, ధూమపానం, నిత్యం తల స్నానం చేయ‌డం, జంక్‌ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వంటి అలవాట్లు ఉన్న వారిలో హెయిర్ ఫాల్ మరింత అధికంగా ఉంటుంది.

కాబట్టి జుట్టు రాలడాన్ని అడ్డుకోవాలంటే ముందు ఆయా అలవాట్లను వదులుకోండి.అలాగే కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నించండి.

ముఖ్యంగా హెయిర్ ఫాల్ కి చెక్ పెట్టడానికి కొత్తిమీర చాలా అద్భుతంగా సహాయపడుతుంది.సాధారణంగా మనం కొత్తిమీరను వంటల్లోనే వాడుతుంటాం.కానీ కొత్తిమీర( Coriander ) మన కురుల సంరక్షణకు సైతం ఉపయోగపడుతుంది.

మరి ఇంతకీ కొత్తిమీర ను తలకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీరను తీసుకుని వాట‌ర్ తో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి.

Advertisement

ఈ కొత్తిమీరను మిక్సీ జార్ లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు స్పూన్లు ఆవనూనె, ఒక స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ కొత్తిమీర రసాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.40 నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే హెయిర్ ఫాల్ ఎంత అధికంగా ఉన్నా కూడా చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.హెయిర్ ఫాల్ ను దూరం చేయడానికి కొత్తిమీర, ఆవ నూనె, కొబ్బరి నూనె ఎఫెక్టివ్ గా ఉపయోగపడతాయి.కొత్తిమీర హెయిర్ మాస్క్( Coriander Hair Mask ) వల్ల జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.

పైగా కొత్తిమీరలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి.ఇవి చుండ్రు సమస్యను దూరం చేస్తాయి.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు