వైరల్: క్షణాల్లో వెల్లుల్లి పొట్టు తీసేసింది.. ఫిదా అవుతున్ననెటిజన్లు

కొందరు చెప్పే వంటింటి చిట్కాలు ఎంతో మేలు చేస్తూ ఉంటాయి.

కిచెన్ ను శుభ్రంగా ఉంచడం ఎలా, ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఏమి చేయాలి.

ఇలా పలు చిట్కాలు మనకు లభిస్తే చాలా సంతోషంగా ఆ లింక్ లను ఓపెన్ చేసి మరి చూస్తుంటాం.ఇప్పుడు అలానే వెల్లుల్లి పొట్టు తీయడం ఎలా.నిజంగా ఈ వెలుల్లి పొట్టు తీయడం కోసం చాలా మంది కుస్తీ పట్లు పడుతూ ఉంటారు.వాటిని డబ్బాలో వేసి కిందకు పైకి అంటే పొట్టు వస్తుంది అని కొందరు, ఇలా పలు చిట్కాలు చెబుతూ ఉంటారు.

అయితే తాజగా ఎలాంటి శ్రమ లేకుండా వెలుల్లి పొట్టు ఎలా తీయాలి అనే విషయాన్నీ చూపుతూ ఒక వీడియో విడుదల అయ్యింది.ఆ వీడియో జనాలకు ఎంతగా నచ్చింది అంటే ఏకంగా రెండు రోజుల్లోనే 2 కోట్ల మందికి పైగా ఆ వీడియో ని చూసారు అంటే అర్ధం చేసుకోవచ్చు.

ఇంకా ఆ వీడియోను పలువురు చూస్తూనే ఉన్నారు.నిజంగా ఈ చిట్కా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.హర్రీ బర్రి జీవితంలో ఇలాంటి వెలుల్లి పొట్టు తీసే పనులు చేయలేక డైరెక్ట్ గా మార్కెట్ లో లభ్యమయ్యే పొట్టు తీసిన వెల్లుల్లి ని తెచ్చి పెట్టుకుంటున్నారు.

Advertisement

అయితే ఇప్పుడు వాలెంతినా లార్డ్ చెఫ్ అనే మహిళ వెల్లుల్లి పొట్టుని ఈజీగా ఎలా తీయాలనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.క్షణాల్లోనే ఆ వీడియో లక్షల వ్యూస్ సాధించడమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియో చూస్తూ తెగ లైక్ లు కొడుతున్నారట.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు