గుర్తుతెలియని మేయిల్స్ పంపే వ్యక్తిని కనిపెట్టడం ఎలా ?

మనకు రోజుకి ఎన్నో ఈమేయిల్స్ వస్తుంటాయి.ఆఫీసు పనులకి సంబంధించినవి కావచ్చు, స్నేహితులు నుంచి కావచ్చు, మనం సబ్స్క్రైబ్ చేసుకున్న అకౌంట్ల నుంచి కూడా కావచ్చు.

ఇవి ఓకే కాని, ఒక్కోసారి కొన్ని ఊహించని ఈమేయిల్స్ వస్తుంటాయి.బ్యాంక్ డీటేల్స్ చెప్పమంటారు, ఇంటి అడ్రెస్ అడుగుతారు, ఏదో ఆఫర్ ఎర చూపిస్తారు.

ఒక్కసారి బెదిరింపులు రావొచ్చు.మనం అంటే గిట్టనివారు ఈమేయిల్స్ రూపంలో బెదిరింపులు పంపే అవకాశం లేకపోలేదు.

అలాంటప్పుడు తము ఎవరో తెలియకుండా ఉండేందుకు ఫేక్ ఈమేయిల్ ఐడి వాడొచ్చు.అమ్మాయిలకి ఆకతాయిలు పంపే అసభ్య మేయిల్స్ కూడా కావచ్చు.

Advertisement

కారణలేవైనా, ఒక ఈమేయిల్ ఐడి వెనుక దాగున్న వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి.ఫేస్ బుక్ వాడని వారెవరు? ఒకవేళ ఆ వ్యక్తి ఆ మేయిల్ ఐడితో ఫేస్ బుక్ వాడితే మాత్రం అతడిని/ఆమెని కనిపెట్టడం సెకన్ల పని.ఎలా అంటే చాలా సింపుల్, ఫేస్ బుక్ సైన్ ఇన్ పేజిలో ఆ ఈమేయిల్ ఐడి ఎంటర్ చేసి ఏదో ఒక పాస్ వర్డ్ టైప్ చేయండి.మీరు ఎంటర్ చేసిన పాస్ వర్డ్ తప్పు అని అంటూనే, ఆ ఐడి వివరాలు కూడా చూపిస్తుంది ఫేస్ బుక్.

దాంతో మీరో ఫేస్ బుక్ లో ఆ వ్యక్తిని వెతికి పట్టుకోవచ్చు.ఫేస్ బుక్ లో కూడా ఆ వ్యక్తి లేకపోతే ఇతర సోషల్ నెట్వర్క్ సైట్స్ లో ఇదే టెక్నిక్ ఉపయోగించండి.

లేదంటే ఐపి అడ్రస్ కనుక్కోండి.ఇక ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో దొరికితే మాత్రం గూగూల్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి మరిన్నీ వివరాలు రాబట్టండి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు