అఖిల్ అక్కినేని వివాహం అటక ఎక్కడంతో అక్కినేని నాగార్జున అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు.ఉన్న అపాయింట్‌మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోని ఇంట్లోనే మూడిగా కూర్చుంటున్న నాగార్జునకి ఇంట్లో కూడా నరకం చూపిస్తున్నారట జనాలు.
అదేలా అంటారా ? మాటిమాటికి ఫోన్లు చేసి.ఫోన్ చేసినోళ్ళు ధైర్యం ఇవ్వాల్సింది పోయి, పెళ్ళి ఎందుకు చెడిపోయింది? కారణం ఏమిటి ? ఎవరిది తప్పు, ఇంతకి నిజంగానే పెళ్ళి చెడిపోయిందా అంటూ ఇబ్బందిపెట్టేస్తున్నారట.
ఓపిక నశించిన నాగార్జున, వారికి సమాధానం చెప్పలేక, తన ఫోన్ నంబర్ కూడా మార్చేసినట్టు టాక్ నడుస్తోంది.ఇదే నిజమైతే మీరే ఊహించుకోండి, నాగార్జునకి ఫ్రెండ్స్, చుట్టాలు, అభిమానులు ఎలా నరకం చూపించారో.
ఈ కొత్త నంబర్ అతికొద్ది మంది దగ్గరే ఉంటుదన్నమాట.ఇక విసిగించడాలు ఉండవు.
చిన్నబాబు వలన ఎన్ని కష్టాలు వచ్చాయో పాపం నాగార్జునకి.అయినా, ఇంత టర్చర్ అనుభవించే బదులు, నాగార్జున ఓ స్టెట్‌మెంట్ విడుదల చేస్తే సరిపోతుంది కదా.ఇలా మౌనంగా ఉంటున్నంత కాలం అనుమానాలు, ప్రశ్నలు ఉండటం ఖాయం.