నాలుకపై నల్ల మచ్చలున్నాయా? అయితే ఇలా త‌గ్గించుకోండి!

సాధార‌ణంగా కొంద‌రి నాలుక‌పై న‌ల్ల మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.నోటి పరిశుభ్రత లేక పోవ‌డం, స్మోకింగ్, కాఫీ.

టీలు అధికంగా సేవించ‌డం, బ్యాక్టీరియా పేరుకు పోవ‌డం, ప‌లు ర‌కాల పోష‌కాల లోపం.ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నాలుక‌పై న‌ల్ల మ‌చ్చ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.

ఇవేమి మ‌న‌కు ఇబ్బంది క‌లిగించ‌క పోయినా.ఇత‌రుల‌తో మాట్లాడే స‌మ‌యంలో అవి అస‌హ్యంగా క‌నిపిస్తుంటాయి.

అందుకే వాటిని త‌గ్గించుకునేందుకు తెగ తాప‌త్రయ ప‌డుతుంటారు.ఇందులో భాగంగానే ఏవేవో మందులు వాడుతుంటారు.

Advertisement
How To Get Rid Of Black Spots On Tongue! Black Spots On Tongue, Tongue, Black Sp

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను పాటిస్తే న్యాచుర‌ల్‌గానే నాలుకపై ఏర్ప‌డిన నల్లటి మచ్చలను వ‌దిలించుకోవ‌చ్చు.ఇంకెందుకు ఆల‌స్యం మ‌రి ఆ చిట్కాలు ఏంటో చేసేయండి.

పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అదే స‌మ‌యంలో నాలుక‌పై న‌ల్ల మ‌చ్చ‌ల‌నూ పోగొడుతుంది.

ప్ర‌తి రోజు చిన్న పైనాపిల్ ముక్క‌ను బాగా న‌మిలి న‌మిలి తింటూ ఉంటే కొద్ది రోజుల్లోనే న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గి పోతాయి.అలాగే ఒక గ్లాస్ నీటితో అర స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు ల‌వంగాల పొడి వేసి బాగా మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత ఈ నీటిని గోరువెచ్చ‌గా అవ్వ‌నిచ్చి.అప్పుడు నోట్లో పోసుకుని బాగా పుక్క‌లించి ఉమ్మేయాలి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇలా ప్ర‌తి రోజు చేస్తే న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా మ‌టుమాయం అవుతాయి.

How To Get Rid Of Black Spots On Tongue Black Spots On Tongue, Tongue, Black Sp
Advertisement

క‌ల‌బంద కూడా నాలుకపై ఏర్ప‌డిన నల్లటి మచ్చలను పోగొట్ట‌గ‌ల‌దు.క‌ల‌బంద ఆకుల‌ను జెల్ తీసుకుని నాలుక‌పై అప్లై చేసుకోవాలి.కొద్ది సేప‌టి త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో మౌత్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక ఒక గిన్నె తీసుకుని అందులో గుప్పెడు వేపాకులు వేసి గ్లాస్ వాట‌ర్ పోసి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించి.

ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఈ నీటితో ఉద‌యం, సాయంత్రం నోటితో పుక్క‌లిస్తే నాలుకపై వ‌చ్చిన న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

తాజా వార్తలు