భూమిపై పెట్రోల్ బావి తవ్వడమెలా? ఎంత లోతు వరకు రంధ్రం చేయవచ్చో తెలుసా మీకు?

మనలో అనేకమందికి చాలా భ్రమలు ఉంటాయి.దాదాపు మనలో ప్రతిఒక్కరు బోర్ వెల్స్ తో భూమికి రంధ్రాలు చేస్తూ ఉంటారు.

అలా లోతు తవ్వేటప్పుడు మరింత లోతుకు తవ్వడానికి కాస్త జంకుతారు.అసలు అలా ఎందుకు భయపడటం? వాస్తవానికి ఎంతవరకు తవ్వుకుంటూ పోవచ్చు? అనే విషయాలు చాలామందికి అస్సలు తెలియవు.భూమి పూర్తి వ్యాసార్ధం తీసుకుంటే సుమారు 6400 కిలోమీటర్లు.

ముఖ్యంగా భూపటలం అనబడే భూమి పై పొర, ఖండాలపై 40–70 కిలోమీటర్లు ఉంటే… సముద్రంలో 6–7 కిలోమీటర్ల వరకు మందంగా ఉంటుందని మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం కదా.ఇప్పటివరకు భూమి పైన తవ్విన లోతైన రంధ్రాలు 3 ఉన్నాయి.కోలా సూపర్ డీప్ బోర్ హోల్ రష్యాలో ఉంది.1984లో దీన్ని తవ్వారు.దీని లోతు చూసుకుంటే, 40230 అడుగులు.

అక్కడి వరకు వెళ్ళాక ఉష్ణోగ్రత బాగా వేడిగా ఉండటంతో పరికరాలు తట్టుకోలేకపోయాయి.అలాగే 2008 లో చేసిన ఈ రంధ్రం లోతు 40600 అడుగులు.

Advertisement

అలాగే 2008లో BD-04A అనే రంధ్రం కతర్ లో తవ్వారు. దీని లోతు 40318 అడుగులు.

ఇక మన దేశం విషయానికి వస్తే ఓఎన్జీసీ కేజీ బేసిన్లో తవ్విన NA7–1 రంధ్రమే అత్యంత పెద్దది.దీని లోతు 10,385 అడుగులు అంటే 3.16 కి.మీ.

ఇకపోతే, అంతరిక్షంలో లక్షల కిలోమీటర్ల దూరాలను చేరుకున్న మానవుడు భూ గ్రహం అంతర్భాగంలో 0.18% మాత్రమే చేరుకోగలిగాడు.కారణం ఘనరూపంలో ఉన్న భూమిలోని పొరలు ఎంతో దృఢంగా ఉంటాయి కాబట్టి.

డ్రిల్లింగ్ చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, భారీ పరికరాలు కావాలి.అడుగడుగునా అనేక ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!

చమురు బావి తవ్వే డ్రిల్ బిట్ గంటకు 7 మీటర్లు మాత్రమే చేస్తుంది.ఒకరోజు డ్రిల్లింగ్ చేయడానికి కొన్ని లక్షల ఖర్చు.

Advertisement

సముద్రాలలో అయితే ఆ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉంటుంది.అదన్నమాట విషయం.

అందుకే బేసిగ్గా అరబ్ కంట్రీలలో చమురుకోసం అన్నివందల, వేల అడుగులు తవ్వుతూ వుంటారు.

తాజా వార్తలు