వన్డే వరల్డ్ కప్ 2023 లో ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు నమోదు అయ్యాయంటే..!

వన్డే వరల్డ్ కప్( ODI World Cup 2023 ) చరిత్రలో ఈ ఏడాది జరుగుతున్న మ్యాచ్లలో ఇప్పటికే చాలా రికార్డులు నమోదు అయ్యాయి.

ఈ ఏడాది ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్లలో ఏకంగా 12 సెంచరీలు నమోదు అయ్యాయి.

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 10 మ్యాచ్లలో ఇన్ని సెంచరీలు నమోదు అవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి.ఈ టోర్నీలో ఆడుతున్న జట్ల ప్లేయర్లు చాలా సులభంగా భారీ స్కోరు ను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ టోర్నీ లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ప్రారంభ మ్యాచ్లో రచిన్ రవీంద్ర,( Rachin Ravindra ) డేవిన్ కాన్వే( Devon Conway ) ఇద్దరు కూడా సెంచరీలు చేసి, ప్రపంచ కప్ ఆరంభం మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో ఇద్దరు ప్లేయర్లు సెంచరీలు చేసిన సరికొత్త రికార్డు సృష్టించారు.

సౌత్ ఆఫ్రికా- శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీ చేసి రికార్డుని క్రియేట్ చేశారు.పాకిస్తాన్- శ్రీలంక( Pak vs SL ) మ్యాచ్ లో నలుగురు ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు.ఈ వన్డే వరల్డ్ కప్ లో వరుసగా సెంచరీల రికార్డులు( Centuries Record ) క్రియేట్ అవుతూనే ఉండడం గమనార్హం.ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్ కప్ లలో మొదటి పది మ్యాచ్లలో అత్యధిక సెంచరీలు సాధించిన సంవత్సరం ఏదో చూద్దాం.1999 లో జరిగిన మొదటి పది మ్యాచ్లలో కేవలం ఒకే ఒక సెంచరీ నమోదు అయ్యింది.1979, 1983, 2019 లలో జరిగిన మొదటి పది మ్యాచ్లలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే నమోదు అయ్యాయి.

Advertisement

1996 లో జరిగిన మొదటి పది మ్యాచ్లలో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి.1975,1992,2007,2011 లలో జరిగిన మొదటి పది మ్యాచ్లలో ఐదు సెంచరీలు నమోదయ్యాయి.1987,2015 లలో జరిగిన మొదటి పది మ్యాచ్లలో ఆరు సెంచరీలు నమోదు అయ్యాయి.2003 లో జరిగిన మొదటి పది మ్యాచ్లలో ఏడు సెంచరీలు నమోదయ్యాయి.2023లో మాత్రం ఇప్పటివరకు జరిగిన పది మ్యాచ్లలో ఏకంగా 12 రికార్డు స్థాయి సెంచరీలు నమోదు అయ్యాయి.ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురు ప్లేయర్లు ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేశారు.

మార్కరం 49 బంతుల్లో సెంచరీ చేశాడు.రోహిత్ శర్మ( Rohit Sharma ) 63 బంతుల్లో సెంచరీ చేశాడు.

కుశాల్ మెండీస్( Kusal Mendis ) 65 బంతుల్లో సెంచరీ చేశాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు