ఆటో డ్రైవర్ నిజాయితీ....

సూర్యాపేట జిల్లా:పది రూపాయలు దొరికితేపక్కకు చూసి తీసుకొని జేబులో వేసుకునే మనుషులున్న నేటి సమాజంలో తన ఆటోలో ఓ మహిళ మరిచిపోయిన నగదును తిరిగి ఆమెకు అప్పగించిన ఆటో డ్రైవర్ ,తన నిజాయితీని నిరూపించుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో గురువారం వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.

ఈ నెల 7వ తేదీన ఈశ్వరమ్మ అనే మహిళ నరసయ్య ఆటోలో ప్రయాణం చేసింది.ఆ సమయంలో రూ.3,500 నగదు,కొన్ని టాబ్లెట్స్ ఉన్న తమ పర్సును ఆటోలో మరిచిపోయింది.ఆ పర్శును గమనించిన ఆటో డ్రైవర్ నరసయ్య ,పర్సులో ఉన్న బిల్లుల ఆధారంగా మునగాల ఆర్ఎంపీ డాక్టర్ భిక్షం కు ఫోన్ చేసి ఈశ్వరమ్మ అడ్రస్ తెలుసుని,నగదు, టాబ్లెట్స్ ఉన్న పర్సుని ఆమెకు అందజేశారు.

Honesty Of Auto Driver , Honest , Auto Driver, Suryapet , Money-ఆటో డ్

ఈ విషయం తెలిసిన వారందరూ ఆటో డ్రైవర్ నరసయ్య నిజాయితీని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.పోయిన పర్సును అందులోని డబ్బును తిరిగి ఇవ్వడంతో ఈశ్వరమ్మ ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement

Latest Suryapet News